భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలను అభినందించిన ప్రధాని మోది


 ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలను అభినందించారు. దేశంలో కరోనా వైరస్ తయారు చేసే పరిశోదనా సంస్థలను శనివారం సందర్శంచిన ప్రధాన మంత్రి జీ నోమ్ వ్యాలిలోని భారత్ బయోటెక్ సంస్థను మద్యాహ్నం సందర్శించారు.
 ఈ సంస్థ కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీని వేగవంతం చేసేందుకు ఐసీఎంఆర్ (భారత వైద్య పరిశోధన మండలి)తో కలిసి పని చేస్తోంది. కోవిడ్-19 నిరోధానికి స్వదేశీ వ్యాక్సిన్ తయారీలో సాధించిన పురోగతిని శాస్త్రవేత్తలు తనకు వివరించారని ప్రధాన మంత్రి ట్విట్టర్ లో  తెలిపారు. ఈ వ్యాక్సిన్ ట్రయల్స్‌లో ఇప్పటి వరకు సాధించిన ప్రగతి పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. 
అంతకుముందు మోదీ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జైడస్ బయోటెక్ పార్క్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీపై సమీక్షించారు. వ్యాక్సిన్ తయారుకు కృషి చేస్తున్న శాస్త్రవేత్తలను అభినందించారు. 
మోదీ హైదరాబాద్ నుంచి పుణే బయల్దేరారు. పుణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీ పురోగతిని సమీక్షిస్తారు. 
హకీంపేట విమానాశ్రాయంలో ప్రదాన మంత్రి నరేంద్ర మోదీకి చీఫ్ సెక్రెటరి సోమేశ్ కుమార్,డిజిపి మహేందర్ రెడ్డి, సిపి సజ్జనార్ తదితరులు స్వాగతం పలికారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు