ఆర్థి కాభివృద్ధిలో ఆంధ్ర ప్రదేశ్ టాప్

 

ఇండియా టుడే సంస్థ మార్కెటింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ రీసెర్చ్‌ అసోసియేట్స్ అధ్యయనం

 


ఇండియా టుడే సంస్థ మార్కెటింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ రీసెర్చ్‌ అసోసియేట్స్‌ (ఎండీఆర్‌ఏ) తో కలిసి   ప్రతి రెండేళ్ల కోమారు నిర్వహించే అధ్యయనంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో అన్ని రాష్ట్రాలను వెనక్కు నెట్టి ఏకంగా టాప్ ర్యాంకులో నిలిచింది. 

ప్రపంచ వ్యాప్తంగా  కరోనా మహమ్మారి విజృంభించి ఏడాది కాలంగా అనేక ధనిక పేద దేశాలు అర్థికంగా అతలా కుతలం ఆయ్యాయి. ఈ పరిస్థితులలో జరిగిన అధ్యయనం  ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కరోనా ప్రతి కూల పరిస్థితులు అధిగమించిన ఆంధ్ర రాష్ర్టం దేశంలో నెంబర్ వన్ పొజిషన్ లో నిలవడం అభినందనీయం. ఈ క్రెడిట్ అంతా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జ గన్ మోహన్ రెడ్డికి దక్కుతది.

అధ్యయనంలో మొత్తం 12 రంగాలలో ఆయా రాష్ట్రాల పురోగతిపై  రాంకులు సిద్ధం చేశారు. ఆర్థిక,శాంతిభద్రతలు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, పరిశుభ్రత, పర్యావరణం, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పర్యాటకం, మౌలిక సదుపాయాలు, సమ్మిళిత అభివృద్ధి, పరిపాలన తదితర రంగాలలో ర్యాంకులు ప్రకటించారు.


మోస్ట్ ఇప్రూవ్డ్ పెద్ద రాష్ట్రాలుగా అస్సాం, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, హర్యానా రాష్ట్రాలు టాప్-5లో నిలిచాయి.

బెస్ట్ పెర్ఫార్మింగ్ విభాగాల్లో తమిళనాడు, హిమాచాల్ ప్రదేశ్, పంజాబ్, కేరళ, గుజరాత్ టాప్-5లో ఉన్నాయి.

కొవిడ్ నియంత్రణకు సంబంధించి పెద్ద రాష్ట్రాల్లో అస్సాం 1వ ర్యాంకులో, తమిళనాడు 2, ఆంధ్రప్రదేశ్ 3వ ర్యాంకులో నిలిచాయి. తెలంగాణ 12వ స్థానంలో నిలిచింది.


వివిద రాష్ట్రాల ర్యాంకులు ఇలా....

  •  ఆర్థిక రంగంలో మోస్ట్ ఇప్రూవ్డ్‌గా ఆంధ్రప్రదేశ్, బెస్ట్ పెర్ఫామర్‌గా గుజరాత్ నిలిచాయి.
  •  మౌలిక సదుపాయాల కల్పనలో బెస్ట్ పెర్ఫామర్ పంజాబ్, మోస్ట్ ఇప్రూవ్డ్ జార్ఖండ్.
  •  వ్యవసాయంలో బెస్ట్ పంజాబ్, మోస్ట్ ఇంప్రూవ్డ్ మధ్యప్రదేశ్.
  •  పర్యాటకంలో బెస్ట్ మహారాష్ట్ర, మోస్ట్ ఇంప్రూవ్డ్ ఆంధ్రప్రదేశ్.
  •  శాంతి భద్రతల్లో పంజాబ్ బెస్ట్ పెర్ఫార్మర్, పశ్చిమబెంగాల్ మోస్ట్ ఇప్రూవ్డ్
  •  విద్యారంగంలో హిమాచల్ బెస్ట్, వెస్ట్ బెంగాల్ మోస్ట్ ఇంప్రూవ్డ్.
  •  ఆరోగ్యంలో కేరళ బెస్ట్, ఒడిశా మోస్ట్ ఇంప్రూవ్డ్.
  •  పరిశుభ్రతలో హిమాచల్ బెస్ట్, ఒడిశా మోస్ట్ ఇంప్రూవ్డ్.
  •  పరిపాలనలో రాజస్థాన్ బెస్ట్ పెర్ఫార్మర్, అస్సాం మోస్ట్ ఇవప్రూవ్డ్


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు