మద్యాహ్న భోజనం డబ్బులు కాజేసిన తండ్రి - బాలిక ఫిర్యాదు
కూతురు ఆలనా పాలనా చూసుకోవాల్సిన తండ్రి ఆమెను గాలికి వదిలేసాడు. తల్లి చనిపోవడంతో మరో పెండ్లి చేసుకున్నాడు. అంతటితో అగుకండా ఆ బాలికకు మద్యాహ్న భోజనం పథకం కింద ప్రభుత్వం ఇచ్చే డబ్బులు, బియ్యం కాజేసాడు. తనకు రావల్సిన డబ్బులు,బియ్యం  తండ్రి  ఫ్రాడ్ చేస్తున్నాడంటూ  ఆ చిన్నారి చివరికి జిల్లా కలెక్టర్ కు తన కన్న తండ్రి పైనే  ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. ఈ చిన్నారి మానవీయ కథనం చాలా మందిని చలింప చేసింది. ప్రభుత్వం మద్యాహ్న భోజనం పథకం కింద ఇచ్చే  డబ్బులు, బియ్యం కాజేస్తున్నాడంటూ ఒడిశా లోని దుకూక అనే గ్రామానికి చెందిన ఆరోతరగతి చదువుతున్న చిన్నారి సుశ్రీ సంగీత సేథి (11) కేంద్ర పారా  జిల్లా కలెక్టర్ సమార్థ్ వర్మను కల్సి ఫిర్యాదు చేసింది. జిల్లా కలెక్టర్ ను కలిసేందుకు ఆ బాలిక 10 కిలోమీటర్లు కాలనడకన ప్రయాణం చేసింది. నవంబర్ 16 వ తేదీన ఈ బాలిక జిల్లా కలెక్టర్ ను కల్సింది. బాలిక తల్లి రెండేళ్ల క్రితం మరణించింది.  తండ్రి రమేశ్ చంద్ర సేథి మరో వివాహం చేసుకున్నాడు. ఆ బాలిక బాగోగులు తండ్రి పట్టించు కోక పోవడంతో మేన మామ  పోషిస్తున్నాడు.  కరోనా కారణంగా పాఠశాలలు మూత పడినా ప్రభుత్వం విద్యార్థులకు ఆన్ లైన్ అక్కౌంట్లలో డబ్బులు  వేసి నెల నెల బియ్యం పంపిణి చేస్తున్నది. ఒక్కొక్క విద్యార్థికి రోజుకు 8 రూపాయలు 150 గ్రామాలు బియ్యం పంపిణ చేస్తున్నారు. తన తండ్రి తన పేరిట వచ్చే డబ్బులకు ఆయన బాంకు అక్కౌంట్ నెంబర్ ఇచ్చి డబ్బులు కాజేస్తున్నాడంటూ ఆ బాలిక జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం అందరిని ఆవేదనకు గురి చేసింది.  బాలిక పేరిట బాంకు అక్కౌంట్ ఉన్నప్పటికి అందులో డబ్బుల ుజమ చేయకుండా తండ్రి పేరిటచ ఉన్న అక్కౌంట్ లో డబ్బులు జమ అవుతున్నాయి. బాలిక ఫిర్యాదుపై స్పందించిన జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశాలు జారి చేసారు. ఇప్పటి వరకు కాజేసిన డబ్బులు రికవరి చేసి బాలికకు అంద చేయాలని ఆదేశించారు. ఇక నుండి బాలుకకు ఏ ఇబ్బందులు తలెత్తకుండా చదువుకునేందుకు ఆటంకం కలగకుండా చూడాలని ఆదేశించారు. 

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బాలిక అక్కౌంట్ లో డబ్బులు వేస్తామని జిల్లా విద్యా శాఖ అధికారి సంజబ్ సింగ్ తెలిపారు. బాలిక తండ్రి ఇప్పటివరకు తీసుకున్న డబ్బులు, బియ్యం రికవరి చేస్తామని చెప్పారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు