హైదరాబాద్ లో వరద భాదితులకు నగదు సహాయం నిలిపి వేత


హైదరాబాద్ నగరంలో వరద భాదిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన రూ 10 వేల సహాయాన్ని నిలిపి వేసారు. అధికారులు ఇప్పటి వరకు పంపిణి చేసిన లెక్కల వివరాలు అంద చేయాలని జిహెచ్ఎంసి అధికారులు ఆదేశించారు. దాంతో నగరంలో నగదు సహాయ పంపకం  కార్యక్రమాలు నిలిచి పోాయయి. అక్టోబర్ 19 న సిఎం కెసిఆర్ నగదు సహాయం ప్రకటించారు. ఇప్పటి వరకు నగరంలో  3.50 లక్షల మందికి రూ357 కోట్ల పంపిణి జరిగింది. హఠాత్తుగా మగదు పంపిణి నిలిపి వేయడం వెనక వేరే కారణాలు ఉన్నాయని విమర్శలు వచ్చాయి. నగదు పంపిణి సందర్బంగా మద్యదళారులు రంగ ప్రవేశం చేసి అసలు లబ్దిదారులకు అందకుండా మాయచేశారని ఆరోపణలు వచ్చాయి. అధికార పార్టి నేతలు కొందరు తప్పుుడు జాబితాలు సృష్టించి నగదు కాజేసారనే ఆరోపణలుకూడ ఉన్నాయి.

నగదు పంపిణీలో జరిగిన అవకతవకలపై అనేక చోట్ల ఆందోళనలు జరిగాయి. అయితే అధికారులు మాత్రం నగదు పంపిణి నిలిపి వేయలేదని ఇక నుండి డివిజన్ కార్యాలయాల్లో సరైన పత్రాలు చూసి నిర్దారణ జరిగిన  తర్వాత పంపిణి జరుగుతుందని వివరణ ఇచ్చారు. సిబ్బంది నగదు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల  వరదల కారణంగా నగరంలో ఇతరత్రా అనేక కార్యక్రమాలు నిలిచి పోయాయని సానిటేషన్ పనులు ఓ వైపు స్థంభించి పోయాయని అధికారులు తెలిపారు. 

మరో వైపు ఇండ్లుపూర్తిగా కూలయోపిన వారికి రూ లక్ష రాక్షికంగా దెబ్బతిన్న వాటికి రూ 50 వేలు అంద చేసేందుకు రెవెన్యూ అదికారులు సర్వే సిద్దం చేస్తున్నారు.

మున్సిపల్ సాఖ మంత్రి కెటిఆర్ మాత్రం ప్రతి లబ్జిదారుడికి సహాయం అందేలా చూస్తామని ట్వీట్ చేసారు. ఆమేరకు మున్సిపల్అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ అథిరిటి ప్రిన్సిపల్ సెక్రెటరీకు సూచనలు జారి చేసామని పేర్కొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు