మందు బాబులకు జగనన్న కానుక - భారీగా తగ్గించిన మద్యం ధరలు


 ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అన్ని వర్గాల ప్రజలకు కానుకలు  అందచేసి హర్షాతి రేకాలు అందుకున్నారు కాని మందు బాబులు మాత్రం జగనంటే పీకల వరకు కోపంతో ఉన్నారు. మద్యం ధరలు విపరీతంగా పెంచడమే కాక పొరుగు రాష్ట్రాల మద్యం కూడ అనుమతించేది లేదన తాజాగా నిర్ణయం తీసుకోవడంతో మందు బాబులు ఇదేంటని చిందుుల వేశారు.  రాష్ట్రంలో అధిక ధరలకు మద్యం ఉండడం వల్ల మద్యం ప్రియులు పొరుగు రాష్ట్రాల వైపుచూస్తున్నారు. దాంతో ఎపిలో  మద్యం అక్రమ రవాణా నియంత్రించడం పెద్దపనిగా మారింది. 

ఇక లాభం లేదని సిఎం జగన్ మద్యం ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాడు.  ఐఎంఎఫ్ఎల్ లిక్కర్ తో పాటు, విదేశీ మద్యంలోని మధ్య, ఉన్నత శ్రేణి బ్రాండ్లపై ధరలను తగ్గిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ తగ్గింపు రూ. 50 నుంచి రూ. 1350 వరకు ఉండనుంది. మీడియం, ప్రీమియంలో 25 శాతం ధరలను తగ్గించింది. అయితే బీర్లు, రెడీ టు డ్రింక్ మద్యం ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.  రూ. 200లోపు క్వార్టర్ బాటిల్ ధరల్లో కూడా మార్పు ఉండదని ప్రభుత్వం తెలిపింది. రూ. 200ల పైన క్వార్టర్ ధర ఉన్న మద్యం రేటు మాత్రమే తగ్గనుంది. బాటిళ్ల పరిమాణాలు, బ్రాండ్లను బట్టి 90 ఎంఎల్ నుంచి లీటర్ వరకు రూ. 50 నుంచి రూ. 1350 వరకు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తగ్గిన ధరలు రేపటి నుంచి అమలు కానున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న అక్రమ మద్యాన్ని అరికట్టేందుకే ధరలను తగ్గిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు