హాలివుడ్ జేమ్స్ బాండ్ సీన్ కానరీ ఇక లేరు

 


హాలివుడ్ లో మిస్టర్ బాండ్ గా స్థిర పడి పోయిన సీన్ కానరీ ఇక లేరు. గత కొంత కాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సీన్ కానరీ శనివారం తుది శ్వాస విడిచారు. 90 సంవత్సరాల సీన్ కానరి 40 సంవత్సరాల పాటుగా హాలివుడ్ ఇండస్ట్రీలో తన నటనతో మెప్పించారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అబిమానులను సంపాదించుకున్నారు. 
 'జేమ్స్ బాండ్'  సిరీస్ లో వచ్చిన ఏడు చిత్రాల్లో నటించారు. నటుడిగా ఏడో దశాబ్దంలోకి అడుగుపెట్టనా సీన్ కానరీ 'స్టార్ పవర్' చెక్కుచెదర లేదు. 'ది అన్ టచబుల్స్' సినిమాలో నటనకు గాను ఉత్తమ సహాయనటుడు (సపోర్టింగ్ యాక్టర్)గా ఆస్కార్ గెలుచుకున్నారు. సీన్ కానరీ 1999లో పీపుల్స్ మ్యాగజైన్ 'సెక్సియస్ట్ మేన్ ఆఫ్ ది సెంచరీ'గా ఎంపికయ్యారు. 199లో కెనడీ సెంటర్ హానర్స్‌ను, 2006లో అమెరికన్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి లైఫ్ ఎచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు. 'ది విండ్ అండ్ ది లైన్', 'ది మేన్ హు వుడ్ బి కింగ్', 'ఇండియానా జోన్స్ అండ్ ది లాస్ట్ క్రూసేడ్', 'ది హంట్ ఫర్ రెడ్ అక్టోబర్' వంటి చిత్రాలు ఆయనకు పేరు ప్రఖ్యాతులు తెచ్చి పెట్టాయి. 

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు