రైతు వేదికల ద్వారానేే పంటల ధరల నిర్ణయం.సిఎం కెసిఆర్


 ఏ ఎల్లయ్యో కాదు ధరలు నిర్ణయించేది
కేంద్రం రైతులకు అన్యాయం చేస్తున్న ది
కేంద్రంపై రైతులు పిడికిలి పట్టి ఉద్యమించాలని పిలుపు



















ఇకనుండి రైతు వేదికల ద్వారానే పంటల ధరల నిర్ణయం జరుగుతుందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు.
 జనగామ జిల్లా కొడకండ్లలో నూతనంగా నిర్మించిన రైతువేదిక భవనాన్ని శనివారం ప్రారంభించారు.

రైతు వేదిక ఏర్పాటు వ్యవసాయ రంగంలో సరికొత్త అధ్యాయం అన్నారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడా రైతులకు ఒక వేదిక లేదని, తెలంగాణాలోనే తొలిసారి రైతుల కోసం భవనాలను ఏర్పాటు చేశామని  చెప్పారు. ఉద్యమ సమయంలో రైతుల బాధలను చూసి కన్నీళ్లు పెట్టుకున్నానని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ రైతులను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
ఇప్పటి వరకు రైతులకు ఒక వ్యవస్థ అంటూ లేదన్నారు. 
రైతు వేదికలు నా కల. ఈ వేదికలు రైతులను సంఘటిత శక్తిగా మారుస్తాయి. త్వరలోనే భూ సమగ్ర సర్వే జరుగుతుంది. సంకల్పం గట్టిగా ఉంటే రైతు రాజ్యం వచ్చి తీరుతుంది. ధాన్యానికి ఎక్కువ ధర ఇస్తామంటే వడ్లు తీసుకోమంటే బంద్ చేస్తారు. ఇతర దేశాల్లో ప్రభుత్వాలు సబ్సిడీలు ఇస్తాయి. మన దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తామంటే ఇవ్వనీయరు. కేంద్ర ప్రభుత్వానికి రైతులపై ప్రేమ లేదు. కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిపించాలి. రైతులు కూర్చుని మాట్లాడుకోడానికి ఒక వేదిక లేదు. కేంద్రం నిర్థారించిన మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయొద్దని ఎఫ్‌సీఐ అంటోంది’ అని కేసీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.

కేంద్రం రైతులకు అన్యాయం చేస్తుందని విమర్శించారు. కేంద్రంపై రైతులు పిడికిలి పట్టి ఉద్యమించాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ నుంచే ఉద్యమం ప్రారంభం కావాలన్నారు. రైతు సంఘటితం కావడానికి రైతు వేదిక ఉపయోగపడాలని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

 రైతు వేదిక ఒక ఆటం బాంబ్‌.. అద్భుతమైన శక్తి. ఏ పంట వస్తే లాభమో రైతు వేదికలే నిర్ణయించాలి. ప్రత్యేక అధికారుల్ని నియమించి రైతులకు సూచన లిస్తామన్నారు. 

 ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌, రైతు స‌మ‌న్వ‌య స‌మితి అధ్య‌క్షుడు ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, మంత్రులు నిరంజ‌న్ రెడ్డి, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, స‌త్య‌వ‌తి రాథోడ్‌, ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.






కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు