జంటనగరాలలోనే ఉల్లి గడ్డల విక్రయాలు

జంటనగారాల్లో ఉల్లిగడ్డ కిలో35 కే విక్రయం 
రైతు బజార్ల ద్వారా విక్రయాలు
ఒక్కొక్కరికి 2 కిలోలు - జిల్లాలలో విక్రయాలు లేనట్లే 


ఉల్లిగడ్డల ధరలు పెట్రోల్ ధరలతో పోటి పడుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు కిలో రూ. 75 నుండి రూ. 100 వరకు ధర పలుకుతున్నాయి. భారి వర్షాలకు దేశ వ్యాప్తంగా ఉల్లి పంట దెబ్బతింది. ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, మహారాష్ర్ట లో ఉల్లి పంటలు బాగా దెబ్బతిన్నాయి. కేంద్రం బఫర్ స్టాక్ నుండి ఉల్లి గడ్డలు రాష్ట్రాలకు సరఫరా చేసేందుకు అంగీకరించింది. కిలో రూ 30 చొప్పున సరఫరా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. తెలంగాణ, తమిళ నాడు రాష్ట్రాలు 8,000 మెట్రిక్ టన్నులు తీసుకుంటున్నాయని కూడ కేంద్రం పేర్కొంది. 

రాష్ట్రంలో హైదరాబాద్ జంట నగరాల్లో 11 రైతు బజార్ల ద్వారా  ఉల్లి గడ్డలు కిలో రూ 35 కు విక్రయించనున్నారు. ఉల్లిధరల నియంత్రణ కోసం మార్కెటింగ్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. జంట నగరాల్లోని 11 రైతుబజార్లలో ఇది అందుబాటులోకి రానుంది. ప్రతి వ్యక్తికి రెండు కిలోల చొప్పున విక్రయిస్తారు. ఏదైనా గుర్తింపుకార్డు చూపించడం తప్పనిసరి చేశారు. భారీ వర్షాలకు దేశవ్యాప్తంగా ఉల్లిపంట దెబ్బతిన్నది. ఎలాంటి లాభం లేకుండా రవాణా ఖర్చులు, దెబ్బతిన్న సరుకును దృష్టిలో ఉంచుకుని అమ్మకాలు జరపాలని మార్కెటింగ్ అధికారులను రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశించారు.

కేవలం జంట నగరాలకే ఉల్లి గడ్డల విక్రయాలు పరిమితం చేయడం ఏమిటని జిల్లాల వారు ప్రశ్నిస్తున్నారు. అందరికి నిత్యావసరమైన ఉల్లి గడ్డలు కేవలం నగర ప్రజలే తింటారా అంటూ మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పై సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. జిల్లాలలో  కూడ రైతు బజార్ల ద్వారా ఉల్లి గడ్డల విక్రయాలు చేపట్టాలని కోరుతున్నారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు