మానుకోట కిడ్నాప్ పోలీసులకు సరికొత్త గుణపాఠం - ప్రమాదకర యాపులు నిషేధించకుండా నేరగాళ్లను పట్టుకోవడం పోసులకు అంత ఈజి కాదు

 యూ టూబ్ కారణంగానే కిడ్నాపర్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నేర్చుకున్నాడు  
డింగ్ టాక్ వాయిస్ ఓవర్ ఇంటర్ నెట్ ప్రోటోకాల్ యాప్‌ను వాడిన కిడ్నాపర్
గూగుల్ ప్లేస్టోర్ లో ఇలాంటి యాపులు వందలు కాదు లక్షల్లో ఉన్నాయి
యూట్యూబ్ లో వాటిని ఎట్లా డౌన్ లోడ్ చేసుకోవాలో ఎట్లా ఇన్ స్టాల్ చేసుకోవాలో నేర్పే వీడియోలు ఉన్నాయి
నిందితుడు యూ టూబ్ వీడియో చూసి యాప్ ఇని స్టాల్ చేసుకున్నాడు
 కిడ్నాప్ వ్యవహారం పోలీసులకు  కొత్త పాఠాలు నేర్పింది
నేరగాళ్లకు తోడ్పడే యాపులు వాటిని వినియోగించే వీడియోలు తొలగించ నంతవరకు నేర సామ్రాజ్యం అదుపు చేయడం ప్రశ్నార్దకమేమానుకోట(మహబూబాబాద్) లో జరిగిన బాలుడి కిడ్నాప్ కేసు పోలీసులకు కూడ సరి కొత్త సవాల్ విసిరింది. పోలీసుల కళ్ల ఎదుటే నిందితుడు  తిరిగాడు.  అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో  పోలీసులు మూడు రోజుల పాటు నిందితుడు ఆచూకి తెల్సుకోలేక పోయారు. పోలీసులకు ఇదొక పెద్ద డ్రా బాక్ అయింది. సాధారణంగా ఆయితే పోలీసులు సెల్ టవర్ సిగ్నల్స్ అధారంగా మొబైల్ ఫోన్ లొకేషన్  కనుగొని నిందితులను పట్టుకుంటుంటారు. కాని మహబూబాబాద్ లో జరిగిన బాలుడి కిడ్నాప్  కేసులో  నిందితున్ని   పట్టుకునేందుకు పోలీసులుకు ఏ ఆధారం కూడ లభించ లేదు. హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా సైబర్ క్రైం పోలీసుల బృందం వచ్చినా లాభం లేక పోయింది.

అంతగా చదువు సంధ్యలు లేని వ్యక్తి కేవలం ఇంటర్ మీడియేట్ చదివిన వ్యక్తి పోలీసులకు అంతుపట్టకుండా వాడిన టెక్నాలజి ఏమిటి అయి ఉండవచ్చు ?  దీక్షిత్ కిడ్నాప్ వ్యవహారంలో అనేక భయాందోళనలు కలిగించే వాస్తవాలు వెలుగు చూశాయి. కిడ్నాపర్ విషయం కాసేపు పక్కన పెడితే ప్రస్తుతం ఇంటర్నెట్ అనేది మొబైల్స్ ద్వారా ఎంతగా జనాలలోకి చొచ్చుకు పోయిందో అందరికితెల్సు. జియో లాంటి కంపెనీలు  చౌక ధరలకే డేటా ప్లాన్స్ ఆఫర్ చేసిన తర్వాత ఎవరి చేతిలో చూసినా ఆండ్రాయిడ్ పోన్లు. ఆన్లైన్లో పాటలు లేదా వీడియోలు చూడడం ఇప్పుడు అందరికి అందుబాటులో వచ్చింది. కేవలం ఎంటర్ టైన్ మెంట్ వరకే అయితే ఫర్వా లేదు కాని ఇంటర్నెట్ ద్వారా వచ్చిన మరో ప్రమాదం ఏంటంటే ప్రమాదకరమైన సాంకేతికత పరిజ్ఞానం.   ఇప్పుడు ఆ పరిజ్ఞానమే కిడ్నాపరు ఆచూకి పోలీసులకు దొరకకుండా చేసింది. వాయిస్ ఓవర్ ఇంటర్ నెట్ ప్రోటోకాల్ యాప్‌ ద్వారా నిందితుడు కాల్స్ చేయడం వల్ల పోలీసులు అతడి ఆచూకి గుర్తించ లేక పోయారు. డింగ్ టాక్ వాయిస్ ఓవర్ ఇంటర్ నెట్ ప్రోటోకాల్ యాప్‌ను నిందితుడు గత ఏడాది కాలంగా ఉపయోగిస్తున్నాడు. తన గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడేందుకు ఈ యాప్ ను తనమొబైల్ ఫోన్ లో ఇన్ స్టాల్  చేసుకున్నాడు.  ఓ మిత్రుడి ద్వారా ఈ యాప్ గురించి తెల్సుకుని యూ ట్యూబ్ లో వెదికి యాప్ ఎట్లా ఇన్ స్టాల్ చేసుకోవాలో వీడియోల ద్వారా నేర్చుకున్నాడు.

 ఈ యాపే దీక్షిత్ రెడ్డి కిడ్నా ప్ కేసులో నిందితున్ని కాపాడింది. ఎక్కడి నుండి మాట్లాడుతున్నాడో తెలియ కుండా పోలీసులను నిస్థేజం చేసింది. నిందితుడు స్కైప్ వీడియో కాల్ ద్వారా లైన్ లోకి వచ్చిన తర్వాత కాని పోలీసులు అతని మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆచూకి తెల్సు కోలేక పోయారు.  అయితే అప్పటికే నిందితుడు దీక్షిత్ ను చంపేసి డబ్బుల కోసం తల్లి దండ్రులను బ్లాక్ మెయిల్ చేసి మూడురోజుల పాటు  కథ నడిపిస్తూ పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు. డింగ్ టాక్ వాయిస్ ఓవర్ ఇంటర్ నెట్ ప్రోటోకాల్ యాప్‌ కనుక లేక పోయి ఉంటే కిడ్నాపర్ ఆటలను పోలీసులు సునాయాసంగా కట్టి పడేసే వారు.

యూటూబ్ లో లక్షల కొద్ది ప్రమాదకర వీడియోలు 

డింగ్ టాక్ వాయిస్ ఓవర్ ఇంటర్ నెట్ ప్రోటోకాల్ యాప్‌  ఒక్కటే కాదు యూటూబ్ లో లక్షల సంఖ్యలో ఇలాంటి ప్రమాద కరమైన యాప్స్ ఉన్నాయి. మన నెంబర్ డిస్ ప్లేకాకుండా ఎదుటి వారితో మాట్లాడ వచ్చు. అన్ నోన్ నెంబర్ నుండి కాల్ చేయవచ్చు. పక్క వారి ఫోన్ కాల్స్ కూడ మనం వారి మొబైల్ పోన్ ట్రాప్ చేసి కాల్స్ వినవచ్చు. వాట్సాప్ చాటింగులు కూడ చదువ వచ్చు. వీటిన్నిటికి ప్రత్యేకంగా యాప్స్ ఉన్నాయి. అవన్ని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గూగుల్ కంపెని ప్లేస్టోర్ లోనే  ఉచితంగా లభ్యం అవుతున్నాయి. డబ్బులు చెల్లిస్తే ఇంకా భయంకర మైన యాప్స్ అనేకం ప్లే స్టోర్ లో ఉన్నాయి. ప్లే స్టోర్ మాత్రమే కాకుండా ఇతర వెబ్ వెబ్ సైట్లలో కూడ డైరెక్టుగా కొన్ని ప్రమాదకరమైన యాపులు అందుబాటులో ఉన్నాయి.  ఏ ఉద్దేశంతో ఈ యాప్స్ గూగుల్ కంపెని అనుమతి ఇచ్చిందో కాని నేరగాళ్లకు మాత్రం బాగా ఉపయోగ పడుతున్నాయి. ఈ యాపులను ఎట్లా ఉపయోగించాలో  యూట్యూబ్ లో  ప్రత్యేకంగా వీడియోలు కూడ పుంఖాను పుంఖాలుగా అన్ని భాషల్లో అందుబాటులో ఉన్నాయి.  ఒకప్పుడు ఇంగ్లీషు. హింది భాషల్లో ఇలాంటి యాప్స్ ఎక్కువగా ఉండేవి. ప్రస్తుతం  అన్ని భారతీయ భాషల్లో  టెక్నాలజిపై వీడియోలు ఉన్నాయి. మన డేటాను ముఖ్యంగా దేశ సైనికుల డేటా చోరి చేస్తున్నారని టిక్ టాక్ వంటి యాప్ లతో పాటు 50 చైనా  యాప్ లను బాన్ చేసింది. మాను కోటలో కిడ్నాపర్ వాడిన  డింగ్ టాక్ వాయిస్ ఓవర్ ఇంటర్ నెట్ ప్రోటోకాల్ యాప్‌ కూడ చైనా దేశానిదే. అలి బాబా కంపెనీకి సంభందించినదని గూగుల్ లో సెర్చ్  ఇంజన్ చూపిస్తోంది. కాని ఇలాంటి ప్రమాద కరమైన యాపులు అనేకం  ఇంకా గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్నాయి. వాటిని ఎట్లా ఉపయోగించాలనే వీడియోలు యూట్యూబ్ లో ఉన్నాయి. ఇలాంటి యాప్ లను పూర్తిగా బాన్ చేస్తే తప్ప నేరగాళ్ళను నియంత్రించడం సాధ్యం అయ్యే పని కాదు. పోలీసు వ్యవస్థ ఎంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పోగు చేసుకుని ఎప్పటి కప్పుడు తర్ఫీదు పొందినా ఇాలాంటి పరిజ్ఞానం ఇంటర్ నెట్ లో అందుబాటులో ఉన్నంత వరకు ఏమి చేయగలిగేది లేదు అని మానుకోట బాలుడి కిడ్నాప్ ఉదంతం కొత్త పాఠం నేర్పింది.  

 


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు