సిఎం సహాయ నిధికి సిని ప్రముఖుల విరాళాలు


భారి వర్షాలతో వరదల్లో చిక్కుకు పోయిన భాగ్యనగర వాసులను ఆదుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు  తమ వంతు సహాయంగా విరాలాలు ప్రకటించారు. చిరంజీవి  కోటి రుపాయలు, మహేశ్ బాబు కోటి రుపాయలు, నాగార్జున రూ 50 లక్షలు, జూనియర్ ఎన్టీఆర్ 50 లక్షలు విజయ్ దేవర కొండ 10 లక్షల చొప్పున ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇచ్చారు. 

గ‌డిచిన వందేళ్ళ‌లో  ఎన్నడూ లేనివిధంగా కుండ‌పోతగా కురిసిన వ‌ర్షాల వ‌ల‌న హైద‌రాబాద్ అత‌లాకుత‌లం అయిపోయింది. అపార ప్రాణన‌ష్టంతో పాటు వేలాది మంది నిరాశ్ర‌యుల‌య్యారు. ప్ర‌కృతి భీభ‌త్సంతో అల్లాడిపోతున్న వారికి నా వంతు సాయంగా తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి కోటి రూపాయ‌ల విరాళం ప్ర‌క‌టిస్తున్నాను. ఎవ‌రికి వీలైనంత వాళ్ళు సాయం చేయాల‌ని ఈ సంద‌ర్భంగా కోరుతున్నాను" అని చిరంజీవి ట్వీట్ చేసారు. అట్లాగే నాగార్జున జూనియర్ ఎన్టీఆర్ తదితరులు కూడ ట్వీట్ చేసారు. తెలంగాణ ప్ర‌భుత్వం త‌క్ష‌ణ సాయం కింద రూ.550 కోట్లు విడుద‌ల చేయ‌డం హ‌ర్ష‌ణీయ మని తన వంతు సహాయంగా 50 లక్షల విరాళం అంద చేశానని నాగార్జున పేర్కొన్నారు. భారి వర్షాల కారమంగా హైదరాబాద్ లో చాలా మంది జీవితాలు దెబ్బతిన్నాయని వారందరికి చేతనైన స,హాయం చేసి తిరిగి హైదరాబాద్ ను పునర్ నిర్మిద్దామంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేసారు.


ఢిల్లీ ప్రభుత్వం తరపున 15 కోట్ల సహాయం ప్రకటించిన కేజ్రి వాల్

వరదల్లో చిక్కుకు పోయిన హైదరాబాద్ నగర వాసులను ఆదుకునేందుకు విరాళాలు అంద చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన పిలుపుకు భారిస్పందన వస్తోంది. వివిద రంగాల ప్రముఖులు అనేక మంది విరాళాలు అంద చేస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వం తరపున 15 కోట్లసహాయం అంద చేసినట్లు ముఖ్యమంత్రి కేజ్రి వార్ తెలిపారు. తమిళ నాడు ప్రబుత్వం 10 కోట్లసహాయం అంద చేసింది. మెఘా ఇంజనీరింగ్ కంపెని 10 కోట్ల సహాయం చేయగా తెలంగాణ రైస్ మిల్లర్లసంఘం 2 కోట్ల సహాయం అంద చేసింది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు