అనగనగా అర్నబ్ గోస్వామి టిర్ పి రేటింగ్ లో ముంబై పోలీసులకు అడ్డంగా దొరికి పోయాడు

అర్నబ్ గో స్వామి టిఆర్ పి రేటింగ్ విషయంలో ముంబై పోలీసులకు దొరికి పోయాడు
అయినా తానేమి తప్పు చేయలేదని పోలీసులే తన పై కక్ష కట్టారన్న అర్నబ్
తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని ఎవరిని వదిలి పెట్ట బోమన్న  పోలీస్ కమీషనర్ పరమ్ వీర్ సింగ్ 
కమీషనర్ పై పరువు నష్టం దావా వేస్తానన్న అర్నబ్ 


 తానొక్కడే నిజాయితి పరుడైనట్లు ఎదుటి వారిని అరిచి కరిచి బొబ్బ చేసే  రిపబ్లిక్ టీవీ ఫౌండర్ అర్నబ్ గో స్వామి ' టిలివిజన్ రేటింగ్ పాయింట్ ( టీఆర్‌పీ) రేటింగ్స్ స్కాం లో అడ్డంగా దొరికి పోయాడు.

దొంగ టీఆర్‌పీ రేటింగ్స్‌ గోల్‌మాల్‌ను ముంబై పోలీసులు బట్ట్ బయలు చేసారు. అందులో అర్నబ్ గోస్వామి రిపబ్లిక్ టివి కూడ ఉంది. దీనితో పాటు ఓ మరాఠి ఛానెల్ మరో మూవి  టివి చానెల్ పై పోలీసులు కేసులు నమోదు చేసారు.  

 ఏ టివి ఛానెల్ అయినా టిఆర్ పి రేటింగ్ ను బట్టి దాని స్థాయి నిర్ణయించ బడుతుంది. టిఆర్ పి రేటింగ్ తెల్సుకునేందుకు కొన్న ివేల టివిలకు ప్రత్యేక డివైస్ లు (పరికరాలు) అమరుస్తారు. ఈ డివైస్ ల వల్ల ఏ ఏ చానెళ్లు ప్రేక్షకులు వీక్షిస్తున్నారో తెల్సి పోతుంది. టిఆర్ పి రేటుంగ్ ను నెల రోజుల కోమారు లెక్క గడతారు. రేటింగ్స్ విషయంలో చాలా కాలంగా కొన్ని చానెళ్లు అడ్డదారులు తొక్కుతున్నాయని విమర్శలు  ఉన్నాయి. నెంబర్ వన్ అనిపించుకునేందుకు  అర్నబ్ గో స్వామి అధ్వర్యంలోని టివి చానెల్ ఇదే పనిచేసింది. 

డబ్బులిచ్చి  డివైస్ లు అమర్చారని చానెల్ చూసినందుకు ఎదురు డబ్బులు ఇచ్చారని  పోలీసులు గుర్తించారు. ఈ బాగోతానికి సంభందించి   ఇద్దరిని అరెస్టు చేయడం జరిగిందని  ముంబై పోలీస్ కమీషనర్  పరమ్‌వీర్ సింగ్‌ తెలిపారు. ఇందులో ఒకరు టీవీల్లో పీపుల్స్ మీటర్స్ అనే పరికరంను ఇన్స్ టాల్ చేసే సంస్థ మాజీ ఉద్యోగని పోలీసులు తెలిపారు. పీపుల్స్ మీటర్ అనేది ఒక పరికరం. దీన్ని టీవీల్లో ఉంచుతారు. ఇదే రేటింగ్స్ ను రికార్డ్ చేస్తుంది.  టీఆర్ పీ రేటింగ్ లో అగ్రస్థానంలో తమ ఛానెల్ ఉందని చెప్పుకుంటున్న రిపబ్లిక్ టీవీకి సమన్లు జారీ చేస్తామని ముంబై పోలీసులు తెలిపారు. న్యూస్ ట్రెండ్స్, తప్పుడు వార్తల ప్రసారం చేస్తున్నాయన్న అనుమానాలు రావడంతో విచారణ చేయగా టీఆర్ పీ రేటింగ్స్ ను మేనేజ్ చేస్తున్నారన్న విషయం వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు.


 ఇప్పటికే ఈ సమాచారం కేంద్రప్రభుత్వంకు అందజేశామని వెల్లడించారు. ఇక టీఆర్ పీ రేటింగ్స్ ను మేనేజ్ చేస్తున్న మూడు ఛానెల్స్ ను గుర్తించడం జరిగిందని వాటికి సంబంధించిన బ్యాంకు ఖాతాలపై కూడా విచారణ జరుపుతామని ముంబై పోలీసులు చెప్పారు. ఈ ఛానెల్స్ కు నిధులు ఎక్కడ నుంచి వచ్చాయి... బెదిరించి నిధులు రాబట్టారా, యాడ్స్ ఎలా వస్తున్నాయి అనే అంశాలను కూడా పరిశీలిస్తామని ముంబై పోలీస్ చీఫ్ పరమ్ వీర్ సింగ్ చెప్పారు. ఇక రిపబ్లిక్ టీవీ టీఆర్ పీ రేటింగ్స్ ను కొనుగోలు చేసిందని ఇప్పుడే ముంబై పోలీసులు చెప్పారంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. 

తమ టీవి పై ముంబై పోలీసులు  కక్ష కట్టి తప్పుడు కేసులు పెట్టారని అర్నబ్ గో స్వామి రిపబ్లిక్ టివి ఆరోపిచింది.  సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో ప్రశ్నలు అడుగు నందుకే తమపై పోలీస్ కమీషనర్ పరమ్ వీర్ సింగ్ కక్ష కట్టాడని అతనిపై పరువు నష్టం దావా వేస్తామని టివి చానెల్ ప్రకటన ప్రసారం చేసింది. 

  టీఆర్ పీ రేటింగ్స్  వ్యవహారంలో ఎంత పెద్ద వారున్నా వదిలేది లేదని వారిని పిలిచి విచారణ చేస్తామని ముంబై పోలీస్ కమీషనర్ పరమ్ వీర్ సింగ్ చెప్పారు. విచారణలో భాగంగా ఏదైనా నేరం జరిగిందని రుజువైతే వెంటనే వారి ఖాతాలను స్తంభింపజేస్తామని వెల్లడించారు. టీఆర్ పీ రేటింగ్స్  మేనేజ్ చేసేందుకు ప్రతి ఇంటికి చెందిన సమాచారం తమ వద్ద ఉందని చెప్పారు.  అసలు ఇంగ్లీషు భాషేరాని ఇండ్లలో  తమ ఛానెల్ 24 గంటలూ ఆన్ చేసి ఉంచాలని రూ 500 చొప్పున చెల్లించారని  కమీషనర్ తెలిపారు. 

అర్నబ్ గోస్వామి ఈ వివాదం నుండి బయట పడటం అంత సులభం కాదు. ఎందుకంటే పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం టిఆర్ పి రేటింగ్ స్కాం కు సంభందించిన పక్కా ఆధారాలు పోలీసుల వద్ద ఉన్నాయి.  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు