‘దిశ ఎన్‌కౌంటర్‌’ సినిమాను నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ వర్మ కార్యాలయం ముట్టడించిన దిశ తల్లి దండ్రులుసెన్సేషనల్ సంఘటనలను ఆధారంగా చేసుకుని సినిమాలు తీసి తిట్లు శాపనార్థాలు తినడం రాంగోపాల్ వర్మకు అలవాటు. దిశ ఘటన ఆధారంగ దిశ ఎన్‌కౌంటర్‌ పేరిట సినిమా ప్లాన్ చేస్తున్న వర్మ నిర్ణయాన్ని దిశ తల్లిదండ్రులు తీవ్రంగ వ్యతిరేకిస్తున్నారు.

’ ఘటన ఆధారంగా తీస్తున్న ‘దిశ ఎన్‌కౌంటర్‌’ సినిమాను నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ దిశ తల్లి దండ్రులు ఆదివారం హైదరాబాద్ లో రాంగోపాల్ వర్మ కార్యాలయాన్ని ముట్ట డించారు. దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి తల్లి తో పాటు పలువురు మహిళలు ముట్టడిలో పాల్గొన్నారు.

  ‘దిశ’ ఘటన ఆధారంగా తీస్తున్న ‘దిశ ఎన్‌కౌంటర్‌’ సినిమాను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రభుత్వం చిత్రాన్ని నిషేధించాలని కోరారు. వివాదాస్పద చిత్రాలు తీస్తున్న రామ్‌గోపాల్‌ వర్మను ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లిదండ్రులు సమాజం నుంచి వెలివేయాలని దిశ తండ్రి శ్రీధర్‌రెడ్డి మీడియాతో అన్నారు. తక్షణమే యూట్యూబ్‌లో ఉన్న ట్రైలర్‌ను తొలగించాలని కోరారు. ఇప్పటికే తమ కుటుంబం ఎన్నో బాధలు అనుభవిస్తోందని, సినిమా తీసి తమను మరింత కుంగదీయొద్దని ఆవేదన వ్యక్తం చేశారు. వర్మ అర్దం చేసుకోకుండ మొండి వ్యవహరిస్తే తగిన రీతిలో బుద్ధి చెబుతామని సినిమా నిలిపి వేయాలని కోర్టును కూడ ఆశ్రయించామని తెలిపారు.

కేసు విచారణ జరిపిన హైకోర్టు అభ్యంతరాలను సెన్సార్‌ బోర్డుకు ఫిర్యాదు చేయాలని దిశ తల్లిదండ్రులకు సూచించింది.అట్లాగే ఫిర్యాదును వీలైనంత త్వరగా పరిష్కరించాలని సెన్సార్ బోర్డును న్యాయస్థానం ఆదేశించింది. కేసు విచారణలో ఉండగా వర్మ సినిమా తీయడం, ట్రయలర్ చిత్రాలు ప్రోమోలు విడుదల చేయడం సరికాదని దిశ తండ్రి శ్రీధర్‌ రెడ్డి అన్నారు.
అయితే కోర్టు ఆదేశాలు దిశ పేరెంట్సు అభ్యంతరాలకు స్పందిస్తూ...రామ్‌ గోపాల్‌ వర్మ ట్వీట్‌ చేశారు. ‘దిశ ఎన్‌కౌంటర్‌ సినిమాపై అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో స్పష్టత ఇవ్వాలి అనుకుంటున్నా. ఇది నిర్భయ కేసు నుంచి జరిగిన అనేక ఘటనల ఆధారంగా తీస్తున్న ఫిక్షనల్‌ స్టోరీ ఇది’ అని ట్వీట్‌ చేశారు.
రాంగోపాల్ వర్మ మా భాదను అర్దం చేసుకోకుండ వ్యవహరిస్తున్నాడని అవసరమైతే సుప్రీంకోర్టు కైనా వస్తానని శ తండ్రి శ్రీధర్‌ రెడ్డి అన్నారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు