ఎంపీ రఘురామ కృష్ణంరాజు కంపెనీలలో సీబీఐ ప్రత్యేక బృందాల సోదాలు


 ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై కేంద్ర దర్యాప్త సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది. బ్యాంక్‌ లోన్‌ బకాయిలపై కేసు నమోదు చేసిన సీబీఐ గురువారం ఆయన నివాసంలో సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌లోని ఆయన నివాసంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఈనెల 6న హైదరాబాద్‌, ముంబై సహా 11 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు చేపట్టింది. రఘురామకృష్ణంరాజు సహా 9 మందిపై సీబీఐ చీటింగ్‌ కేసు నమోదు చేసింది. ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ ప్రత్యేక బృందాలు సోదాలు చేపట్టారు. ఇండ్‌-భారత్‌ కంపెనీతో సహా ఎనిమిది కంపెనీలకు చెందిన డైరెక్టర్ల ఇళ్లలోనూ తనిఖీలు చేసింది. ఉదయం ఆరు గంటల నుంచి  సాయంత్రం సోదాలు కొనసాగాయి. ఈ దాడుల్లో పలు కీలక డాక్యూమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

2019 ఏప్రిల్‌ 30న బ్యాంక్‌ లోన్‌ బకాయిలు పడిన కేసులో సైతం హైదరాబాద్‌, భీమవరంలోని రఘురామకృష్ణంరాజు కంపెనీల్లో సోదాలు చేపట్టారు. వివిధ ప్రాజెక్ట్‌లకు సంబంధించి రూ.600 కోట్ల మేర ఆయన రుణాలు తీసుకున్నారు. ఇక ఇండ్‌-భారత్‌ పవర్‌ లిమిటెడ్‌కు సంబంధించి రూ.947 కోట్ల మేర బ్యాంకులకు రుణాలు ఎగ్గవేయగా, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ ఇనిస్టిట్యూట్ల నుంచి రూ.2655 కోట్ల మేర రఘురామకృష్ణంరాజు లోన్‌ తీసుకున్నారు.


దాడులు లేవు...సోదాలులేవు మీడియా లో నే చూశా

తన ఇంట్లో ఎలాంటి ఐటీ సోదాలు జరగడం లేదన్నారు ఎంపీ రఘురామ కృష్ణంరాజు  . ఐటీ సోదాలు అన్న వార్త మీడియా ద్వారానే తెలుసుకున్నానని.. హైదరాబాద్‌, ఢిల్లీలో ఉన్న తన ఇళ్లలో ఎలాంటి తనిఖీలు జరగలేదని.. దీనికి సంబంధించి తనకు ఎలాంటి సమాచారం ఎవరు ఇంతవరకు ఇవ్వలేదు అన్నారు. ఈ సీబీఐ సోదాల విషయం ఎలా బయటకు వచ్చిందో తనకు తెలియదు అన్నారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు