ఎదురు చూసిన రామరాజు ఫర్ భీమ్ టీజర్ విడుదల చేసిన జక్కన

 


`వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి. నిలబడితే సామ్రాజ్యాలు సాగిలపడతాయి. వాడి పొగరు ఎగిరే జెండా. వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ. వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దు బిడ్డ. నా తమ్ముడు గోండ్రు బెబ్బులి.. కొమురం భీమ్` అంటూ రామ్‌చరణ్ వాయిస్ ఓవర్‌తో ఎన్టీయార్ పాత్రను పరిచయం చేస్తు అందరు ఎదురు చూసిన ట్రిపుల్ ఆర్ టీజర్ ను బాహుబలి  రాజమౌళి  గురువారం విడుదల చేసాడు. ఇద్దరు అగ్ర యువ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు కొమురం బీం, అల్లూరి సీతారామ రాజుగా చారిత్రక పాత్రలు పోషిస్తున్నారు.

 వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి ఆలియా భట్ నటిస్తున్నారు. మరో ప్రధాన పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తున్నాడు. దీంతో ఈ మూవీపై దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొని ఉండగా, అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. 

 భారీ బడ్జెట్‌ సినిమా లో అలియా భట్‌, ఒలీవియా మోరిస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.మరో ప్రధాన పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తున్నాడు. దీంతో ఈ మూవీపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. వాటన్నింటికి ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్‌ తిరిగి ఇటీవల ప్రారంభమైంది. 

అభిమానుల భారీ అంచనాల నడుము విడుదలైన ఈ టీజర్‌పై పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయి. ములుగు ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నాయకురాలు సీతక్క సైతం ట్విటర్‌ వేదికగా స్పందించారు. కొమురం భీం పాత్రపై విడుదల చేసిన టీజర్‌ను జోడిస్తూ ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ టీంకు అభినందనలు తెలిపారు.‘మన్యం ముద్దుబిడ్డ. మా అన్న, మా ఆదర్శం కొమరం భీమ్ గారి జయంతిన నా ఘన నివాళులు. మా వీరుడు మన్యం పులి కొమరం భీమ్ గారి స్పూర్తితో తీస్తున్న చిత్ర యూనిట్ కి నా అభినందనలు’ అని ట్వీట్‌ చేశారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు