అడవి దేవులపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత - గిరిజన మహిళను కొట్టిచంపారని మృత దేహంతో ధర్నా

 


నల్గొండ జిల్లా లో పోలీసులు ఓ గిరిజన మహిళను కొట్టిచంపారని భందువులు ధర్నాకు దిగారు. మిర్యాల గూడ నియోజక వర్గం పరిధిలోని ఉన్సాయిపల్లి గ్రామానికి చెందిన   కేతావత్ సక్రి (55) అనే గిరిజన మహిళ సారా విక్రయిస్తోందని అఢవి దేవులపల్లి పోలీసులు పట్టుకెళ్లి తీవ్రంగా కొట్టారని మృతురాలి భందువులు ఆరోపించారు.  సక్రిని పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ  నాగుల మీరా బాగా కొట్టాడని తీవ్ర గాయాలతో గ్రామానికి వచ్చిన సక్రి ఇంట్లో మరణించిందని సక్రికుటుంబ  సబ్యులు తెలిపారు. పోలీసులు కొట్టిన దెబ్బలకే సక్రి బలమైన గాయం తగిలి  మరణిచిందని  సక్రి కుటుంబ సబ్యులు భందువులు పోలీస్ స్టేషన్ ఎదుట సక్రి మృత దేహంతో  ధర్నాకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెల కొన్నాయి.  సక్రిని కొట్టిన పోలీసులపై చర్యలుతీసు కోవాలని డిమాండ్ చేసారు.  వారు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసుల తీరుపై గ్రామస్థులు కూడ ఆగ్రహం వ్యక్తం చేసారు. పరిస్థితులు ఉద్రిక్తతగా మారడంతో ఎక్కడ దాడి చేస్తారనని భయపడి  పోలీసులు పోలీస్ స్టేషన్ తలుపులు మూసి  ఫరారీ అయ్యారు. 

తమకు న్యాయ జరిగే వరకు ఆందోళన విరమించ బోమని సక్రి భందువులు పోలీస్ స్టేషన్ ఎదుటే బైఠాయించారు. పోలీసు ఉన్నతాధికారులు ఎవరూ  గ్రామానికి చేరు కోలేదు. గ్రామంలో పరిస్థితులు శాంత పరిచేందుకు పోలీసులు స్థానికి ప్రజా ప్రతినిధుల సహాయం కోరి సంప్రదింపులు జరుపుతున్నారని తెల్సింది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు