ఆసుపత్రి బయట అభిమానుల ఆందోళన - కారులో వచ్చి ఆశ్యర్య పరిచిన ట్రంప్

 కారులో వచ్చి బయట తిరిగినందుకుత్పపు పట్టిన వైద్య నిపుణులు
కోవిడ్ నిభందనలు పాటించ లేదని విమర్శలు


కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితులపై రక రకాలుగా వార్తవు వెలువడుతుండడంతే ఆయన అభిమానులు మద్దతు దారులు ఆందోళనకు గురయ్యారు. మెరీ లాండ్ లోని వాల్టర్ రీడ్ సైనిక  ఆసుపత్రి బయట పెద్ద సంఖ్యలో చేరిన అభిమానులు మద్దతు దారులు ట్రంప్ ఆరోగ్య పరిస్థితులు ఆరా తీసారు. వేలాది మంది ఆసుపత్రి బయట వేచి ఉండడంతో ట్రంప్ ఒక్క సారిగా వారిని అశ్చర్య చకితులను చేసారు. 

ఉన్నట్టుండి ఆసుపత్రి బయట ప్రత్యక్షమయ్యారు. ఓ నల్లటి కారులో కూర్చుని.. తన మద్దతుదారుల మధ్య తిరిగారు. ఈ సందర్భంగా ఆయన.. తన అభిమానులకు అభివాదం చేశారు. చప్పట్లు కొట్టి వారిని ఉత్సాహ పరిచారు. తాను బాగానే ఉన్నానన్న భరోసా వారికి కలిగేలా చేశారు. అయితే ట్రంప్ తీరును వైద్యనిపుణులు తప్పుబట్టారు. వైరస్ సోకిన వ్యక్తి నిబంధనల ప్రకారం బయట తిరగొద్దని తెలిసినా.. ట్రంప్ దాన్ని ఖాతరు చేయలేదని విమర్శిస్తున్నారు. కొవిడ్ నిబంధనలను ఆయన ఉల్లఘించారని ఆరోపించారు. అంతేకాకుండా ట్రంప్ ప్రయాణించిన కారులో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఆరోగ్యంపట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. భద్రతలో భాగంగా ట్రంప్‌తోపాటు కారులో ప్రయాణించిన సెక్యూరిటీ సిబ్బందిని.. 14 రోజులపాటు క్వారెంటైన్‌లో పెట్టాలని అభిప్రాయపడుతున్నారు. 

ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఇండో-అమెరికన్ల ప్రార్థనలు 


కరోనా వైరస్‌ బారిన పడ్డ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ త్వరగా కోలుకోవాలని భారత అమెరికన్ సమాజం ఆదివారం సాయంత్రం మేరీల్యాండ్‌లోని వాల్టర్‌ రీడ్‌ సైనిక ఆసుపత్రి బయట ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా భారతీయ అమెరికన్లు మంత్రాలు చదవడంతో పాటు శంఖం కూడా ఊదారు. అమెరికాలోని వివిధ నగరాల నుండి సైతం ట్రంప్ అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు