మహిళలపై అత్యాచారాలు చేసిన దొంగ బాబా -వీధుల్లో పరుగెత్తించి కొట్టిన మహిళలు

 

అక్షరం పేరిట పత్రిక నడిపిస్తున్న దొంగ బాబా

నిజామాబాద్ లో దొంగ బాబా గుట్టురట్టు 
మూడు నెలలుగా ఓ యువతిపై అత్యాచారం
యువతి గర్భం దాల్చడంతో రట్టైన గుట్టు
వీధుల్లో పరుగెత్తించి కొట్టి పోలీసులకు అప్పగించిన మహిళలు నిజామాబాద్ లో భూత వైద్యం పేరిట మహిళలపై అత్యారాలు చేస్తున్న దొంగ బాబా గుట్టు రట్టు చేసారు. మంగళవారం మహిళలు అతనికి దేహశుద్ది చేసారు.  దొంగ బాబాను  వీధుల్లో తరిమి తరిమి కొట్టారు. ఆ తర్వాత అతన్ని పోలీసులుక అప్పగించారు.  పోలీసుల విచారణలో దొంగ బాబా  వేశాలు అనేకం వెలుగు చూసాయి. అనేక మంది మహిళలకు మత్తు మందు ఇచ్చి అఘాయిత్యం చేసినట్లు వెల్లడైంది.

మెట్ పల్లికి చెందిన తల్లి కూతురులు గత మాడు నెలలక్రితం అనారోగ్య సమస్యలు ఉన్నాయని బాబా దగ్గరకు వైద్యం కోసం వచ్చారు. మహిళ కూతురుకు  వైద్యం చేస్తానని గదిలోకి తీసుకు వెళ్లి మత్తు ఇంజిక్షన్ ఇచ్చి  అత్యాచారం చేసాడు.  మూడు నెలలుగా బాలిక పై అత్యాచారాలు కొనసాగించాడు. బాలికకు కడుపు నొప్పి రావడంతో వైద్య పరీక్షలు చేయించగా గర్భవతి అయినట్లు వైద్యులు చెప్పడంతో దొంగ బాబా విషయం వెలుగు చూసింది. నిజామాబాద్ లో ని పూసల వీధీలో  ఉంటూ అక్షరం అనే ఓ పత్రిక కూడ నడిపిస్తున్న దొంగ బాబా భూత వైద్యం  పేరిట అమాయక మహిళలను మోసగించి అత్యాచారాలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.  బాబా చేతిలో మోస పోయి గర్భవతి అయినబాలికను పోలీసులు ఆసుపత్రిలో చేర్పించారు .

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు