మారటోరియం కాలానికి వివిద రకాల బాంకు రుణాల వడ్డీకి వడ్డి మాఫీ

 

వివిద రకాల బాంకు రుణాలు పొందిన వారికి ఊరట కలిగేలా కేంద్రం ఓ నిర్ణయం తీసుుకంది. కరోనా  కారణంగా ఆరు నెలల పాటు బాంకు రుణాలపై విధించిన మారటోరియంకు సంభందించిన రుణాల వడ్డీకి  వడ్డి మినహాయించ నుంది.కేంద్రం ఓ శుభవార్త చెప్పింది. కరోనా లాకా డౌన కాలంలో ఆరు నెలలపాటు వివిద రకాల బాంకు రుణాలకు ప్రకటించిన ఆరు నెలల మారటోరియంకు సంభందించిన రుణాల వడ్డీకి వడ్డి బారాన్ని తగ్గించనున్నట్లు తెలిపింది.   లాక్‌డౌన్ సంద‌ర్భంగా రుణాల‌కు సంబంధించి ఆరు నెల‌ల‌పాటు  విధించిన‌ మార‌టోరియంపై కేంద్ర ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది.  మార‌టోరియం స‌మ‌యంలో కొన్ని ర‌కాల రుణాల‌పై వ‌డ్డీకి వడ్డి వ‌దులుకునేందుకు సిద్ధ‌మ‌ని కేంద్రం స్ప‌ష్టంచేసింది. 

మైక్రో, స్మాల్ మరియు మీడియం ఎంటర్ ప్రైజెస్  ( ఎంఎస్ఎంఈలు) రుణాలతో పాటు గృహ రుణాలు‌, విద్యా రుణాలు‌, వాహ‌న రుణాలు, క్రెడిట్ కార్డు బ‌కాయిల‌పై, వినియోగ‌దారు వ‌స్తువుల ఈ ఎంఐల‌పై వ‌డ్డీ ల‌కు వడ్డి మిన‌హాయించ‌నున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం అఫిడ‌విట్ ద్వారా సుప్రీకోర్టుకు వివ‌రించింది. స‌మ‌స్య‌కు వ‌డ్డీ భారాన్ని భ‌రించ‌డ‌మే ఏకైక ప‌రిష్కార‌మ‌ని నిర్ణ‌యించిన‌ట్లు అఫిడ‌విట్‌లో పేర్కొన్నది. అయితే అన్ని ర‌కాల రుణాల‌కు వ‌డ్డీని చెల్లించాలంటే రూ.6 ల‌క్ష‌ల కోట్లు భారం ప‌డుతుంద‌ని, అది చాలా అధిక‌మ‌ని, అందుకే రూ.2 కోట్లు ఆ లోపుగ‌ల రుణాల‌కే వ‌డ్డీ చెల్లించాల‌ని నిర్ణ‌యించామ‌ని కేంద్రం తెలిపింది. 

ఆర్థిక మిపుణులు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. ఏప్రిల్‌ నుంచి సెప్టెంబ‌ర్ వ‌ర‌కు ఆరు నెల‌లపాటు కేంద్రం మార‌టోరియం విధించింది. అయితే బ్యాంకింగ్ సంస్థ‌లు మార‌టోరియం స‌మ‌యంలో బకాయిల‌పై వ‌డ్డీలు లెక్క‌గ‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో విష‌యం కోర్టుకు చేర‌గా.. కోర్టు ఆదేశాల మేర‌కు తాజాగా కేంద్రం అఫిడ‌విట్ స‌మ‌ర్పించింది.  ఇది ఎంతైనా బాంకుల రుణ గ్రహీతలకు    కొంత వరకు ఊరట కలిగించే విషయమని పేర్కొంటున్నారు. 

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు