బదిలి చేయుస్తానని నమ్మించి అత్యాచారం ఆ పై బ్లాక్ మెయిల్

       ఓ రియల్టర్  దుర్మార్గంపై  మహిళ ఫిర్యాదు




ఆదిలాబాద్ జిల్లాలో పనిచేస్తున్న ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగిని ని నమ్మించి మోసగించిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిపై  ఆ ఉద్యోగిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం జరిపి ఆపై ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసి నగదు బంగారం కాజేసాడని ఫిర్యాదులో పేర్కొంది.  

ఆ మహిళ చేసిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో పనిచేస్తున్న 35 సంవత్సరాల ఉద్యోగిని భర్త పిల్లలు హైదరాబాద్ లో నివసిస్తున్నారు. ఆ మహిళ తాను కూడ హైదరాబాద్ కు  బదిలి చేయించుకునేందుకు  ప్రయత్నాలు చేసి విఫలం అయింది. దాంతో  తన భందువుల ద్వారా  మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మామిడి పల్లికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గాడిపల్లి చంద్రశేఖర్ పరిచయం అయ్యాడు. తనకు టిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా మందితో పరిచయాలు ఉన్నాయని హైదరాబాద్ కు బదిలి చేయుస్తానని ఆ మహిళను నమ్మించాడు. ఒక రోజు హైదరాబాద్లో తన ఇంటికి తీసుకు వెళ్లి ఆ మహిళపై అత్యారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. తన దగ్గర పోటోలు, వీడియోలు ఉన్నాయని చెప్పి అనేకి సార్లు బ్లాక్ మెయిల్ చేసి రూ 10 లక్ష వరకు నగదు సుమారు 35 తులాల బంగారు ఆభరణాలు తీసుకున్నాడు.  ఇంకా డబ్బుల కోసం వేధిస్తున్న చంద్రశేఖర్ విషయం ఆ మహిళ తన భర్తకు చెప్పి  ఆయన సహాయంతో అక్టోబర్ 3 న  పోలీసులకు పిర్యాదు చేసింది. దాంతో ఆదిలాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి చంద్రశేఖర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు