అమితాబ్ - ప్రభాస్ ను కలిపిన వైజయంతి మూవీస్

 వైజయంతి మూవీస్ సంస్థ  50 వ ప్రతిష్టాత్మక చిత్రంలో ప్రభాస్  అమితాబ్ కాంబినేషన్ లో బారి బడ్జెట్ చిత్రంబిగి బి అమితాబ్ బచ్చన్ బాహుబలి ప్రభాస్ ఇద్దరూ కల్సి నటించే అవకాశం వైజయంతి మూవీస్ సంస్థ కల్పించింది. వీరిద్దరి పాత్రలకు సరైన న్యాయం చేకూర్చే  కథాంశంతో  వెండితెరకు వారి కాంబినేషన్ గుర్తుండి పోయేలా ఉండాలని చిత్ర  నిర్మాణ రంగంలో50 వసంతాలు పూర్తిచేసుకున్న  వైజయంతి మూవీస్ సంస్థ  మహానటి` డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో  భారి బడ్టెట్ చిత్రం రూపకల్పన చేసేందుకు సర్వం సిద్దం చేసింది. తమ  ప్రతిష్టాత్మక చిత్రంలో  బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించ బోతున్నాడనే  విషయాన్ని వైజయంతి మూవీస్ సంస్థ స్వయంగా ట్వీట్ చేసి వెల్లడించింది. 

`లెజెండ్ అమితాబ్ బచ్చన్ లేకుండా లెజెండరీ సినిమాను ఎలా తెరకెక్కించగలం` అంటూ ఓ ట్వీట్ చేయగా అందుకు బిగ్ బి కూడ స్పందిస్తూ రి ట్వీట్ చేసారు. `ఎంతో ప్రతిష్టాత్మకమైన, మైలురాయి లాంటి ఈ సినిమాలో భాగం కావడాన్ని ఓ గొప్ప గౌరవంగా భావిస్తున్నా. 50 వసంతాలను పూర్తి చేసుకుంటున్న వైజయంతీ మూవీస్‌‌కు అభినందనలు. ఇలాగే మరో 50 ఏళ్లను కూడా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నా` అంటూ అమితాబ్ రీ ట్వీట్ చేసారు.  అమితాబ్ తో కల్సి నటిస్తుండటం పట్ల ప్రభాస్ కూడ సంతోషం వ్యక్తం చేశారు. అమితాబ్ బచ్చన్ సర్ తో  కల్సి వెండి తెరను పంచు కోవాలనుకున్న తన కల నెరవేరిందంటూ ప్రభాస్ సంతోషం వ్యక్తం చేసారు.  సైన్స్ ఫిక్షన్ ఇతివృత్తంగా ఈ భారి బడ్జెట్ సినిమా రూపొందుతొందని చిత్ర రంగంలో టాక్ విని పిస్తోంది.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు