అనుమానం పెనుభూతమైంది. భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం కలిగి ఉందని అనుమానించిన భర్త భార్య తలనరికి ఆమె ప్రియుడి ఇంటి ఎదుట పడేసి పోలీసులకు లొంగిపోయాడు.
సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ దారుణ సంఘటన క్రూరమయ మైన నేర స్వభావాలకు అద్దం పడుతోంది.
తనభార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నందు వల్లే కోపంతో ఆమె తల నరికానని భర్త చెప్పిన మాటల్లో నిజమెంతవరకు ఉందో వేరే కారణాలు ఉన్నాయా అని పోలీసులు విచారిస్తున్నారు.
జిల్లాలోని నారాయణఖేడ్ మండలం అనంతసాగర్ గ్రామంలో గొల్ల అనసూజ. సాయిలు ఇరువురు భార్యాభర్తలు. అనసూజ నారాయణఖేడ్ లో నివాసం ఉండే జైపాల్ రెడ్డి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తామని భర్త ఆరోపణ. ఈ సంగతి గుర్తించి కోపం పట్టలేకే భార్య అనసూజను హత్యచేసిన సాయిలు పోలీసులకు చెప్పాడు.
అనంతరం ఆమె తలను మొండెం నుంచి వేరు చేసి మొండాన్ని అనంతసాగర్ గ్రామంలోనే ఉంచి, అనసూజ తలను నారాయణఖేడ్ లోని ఆమె ప్రియుడు జైపాల్ రెడ్డి ఇంటి ముందు పడేశాడు. అనంతరం సాయిలు నారాయణఖేడ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
సాయిలును ఘటనా స్ధలికి తీసుకెళ్లి విచారిస్తున్నారు. హత్యకు గురైన అనసూజ మృత దేహాన్ని పోస్టు మార్గం కోసం ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
0 వ్యాఖ్యలు
Please Do not enter any spam link in the comment box