సిడ్నీలో ఘనంగ బతుకమ్మ వేడుకలు

 మొట్టమొదటిసారిగా వర్చువల్ బతుకమ్మ వేడుకలను నిర్వయించిన సిడ్నీ బతుకమ్మ &దసరా ఫెస్టివల్ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్(SBDF)మరియు ఆస్ట్రేలియన్తెలంగాణ ఫోరం(ATF) 



ప్రపంచవ్యాప్త ఎన్నారైలను ఏకం చేసి బతుకమ్మ ఉత్సవాలుఘనంగా ప్రారంభించిన ఆస్ట్రేలియన్తెలంగాణ ఫోరం(ATF)



SBDF ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు  ప్రపంచ తెలంగాణ ఎన్నారై ప్రతినిధులతో బతుకమ్మ అట పాటలతో శనివారం అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆస్ట్రేలియా లోని ఇతర రాష్ట్రాల ప్రతినిధులు మరియు ప్రపంచంలోని  న్యూజ్లాండ్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, మలేషియా, దుబాయ్  వంటి  పలుదేశాల నుండి తెలంగాణ ప్రతినిధులు వర్చువల్గా పాల్గొనటం జరిగింది.  అయితే ప్రతి సంవత్సరం లాగ ఒకే చోట గుమికాకుండా, కోవిద్ వాతావరణానికి అనుకూలంగా మాస్కులు ధరించి సోషల్ డిస్టెన్స్ మైంటైన్ చేస్తూ వినూత్నంగా అంతర్జాలంలో ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండి ఆన్లైన్ లో బ‌తుక‌మ్మఆటా…పాటతో సిడ్నీ ప‌ర‌వ‌శిచింది..!!




సిడ్నీ లోని అన్ని ప్రాంతాలనుండి ఆన్లైన్ బతుకమ్మ సెలెబ్రేషన్స్ లో పాల్గొనడం జరిగింది కరోనా మహమ్మారి వల్ల ఈ విధంగా జరిగింది.  అయితే వర్క్ ఫ్రొం హోమ్  ఎట్లాగైతే అలవాటు చేస్తున్నామో అదేవిధంగా ఈ బతుకమ్మ అడే విధానాన్ని  కూడా మార్చుకోవడం జరిగింది. ఈసారి గౌరమ్మను కరోనా నుంచి కాపాడమని SBDFమహిళామణులు పాటలు రాసి పాట రూపకంగా ప్రాధేయపడ్డారు.SBDF ప్రధాన ఆశయాలలో  తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించటం ప్రధానమైనది. సంస్కృతీ సంప్రదాయాలను ముందు తరాలకు తీసుకొనిపోవాలంటే ఇప్పటి యువతీయువకులకు, పిల్లలకి నేర్పించినట్లయితే అది బావితరాలకు సంక్రమిస్తదనేది SBDF అధ్యక్షుని అభిప్రాయం. ఈ లక్ష్యం కార్యరూపం దాల్చే దిశగా SBDF అడుగులు పడుతున్నవి.

అందరూ ఆన్లైన్ ఒక్కచోటకూడి ఇలా బతుకమ్మనువేడుకగా జరుపుకోవడంచాలా ఆనందంగాఉందని  SBDF అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి తోతుకుర్ తెలిపారు. ఈ బతుకమ్మ సంబురాల్లోసుమారు 500 మంది వరకు ఆన్లైన్ పాల్గొన్నారు.




సిడ్నీ బతుకమ్మ 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు