రాజస్థాన్‌లో దారుణం పూజారిని సజీవ దహనం చేసిన భూ మాఫియా ముఠా

 తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించిన పూజారి
ప్రధాన నిందితుడు కైలాశ్ మానాను అరెస్ట్ చేసిన పోలీసులు


రాజస్థాన్ లో  భూ ఆక్రమణ మాఫియా ముఠా రెచ్చి పోయింది. ఓ ఆలయ పూజారికి చెందిన భూముల్లో పాగా వేసి ఆక్రమించేందుకు ప్రయత్నించగా ఆయన అడ్డు కోవడంతో అతనిపై కిరిసోన్, పెట్రోల్ పోసి నిప్పంటించారు. కారౌలి జిల్లా సపోత్రాలోని బుక్నా గ్రామంలో బుధవారం నాడు ఈ సంఘటన జరిగింది. 50 శాతం కాలిన గాయాలతో పూజారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించాడు.  

పూజారిపై దాడి చేసి నిప్పంటించిన కేసులో ప్రధాన నిందితుడు కైలాశ్ మీనాను అరెస్ట్ చేయగా మరో ఐదుగురు ఫరారీలో ఉన్నారని వారి కోసం ఆరు గాలింపు బృందాలు ఏర్పాటు చేసామని కారౌలి ఎస్పీ మృదుల్ కచ్వా తెలిపారు. 

రాధాకృష్ణా ఆలయ ట్రస్ట్ బోర్డు వారు ఆలయ పూజారి బాబు లాల్ వైష్ణవ్ కు 5.20 ఎకరాల బూమిని ఇచ్చారు. ఆభూమిని ఆక్రమించేందుకు కైలాశ్ మీనా చాలా సార్లు ప్రయత్నించగా పూజారి గ్రామ పెద్దలను ఆశ్రయించాడు. ఆ భూమి పూజారికే చెందుతుందని కైలాశ్ మీనాకు ఎలాంటి సంభందం లేదని తీర్పు చెప్పారు. అయినా కైలాశ్ మీనా పూజారి బూములు ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేశాడు.  ఆ భూమిలో పూజారి ఇళ్ళు నిర్మించుకునేందుకు పనులు మొదలు పెట్టగా కైలాశ్ మీనా అధ్వర్యంలో ఆరుగురు లాండ్ మాఫియా ముఠా సబ్యులు అడ్డుకున్నారు. వారు కూడ మరో వైపు ఇళ్ళు నిర్మించేందుకు ప్రయత్నించగా పూజారి వారిని అడ్డగించాడు. దాంతో పూజారిపై కిరోసిన్, పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా  కాలిన గాయాలతో స్థానికంగా ఎస్ఎంఎస్ ఆసుపత్రిలో పూజారి చికిత్స పొందుతూ మరణించాడు. శరీరమంతా పూర్తిగా కాలి పోయి హాహా కారాలు చేస్తున్న పూజారి వీడియో సోషల్ మీడియాలో చూసిన వారంతా ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. నిందితులను అరెస్ట్ చేసి ఖఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు