చంద్రబాబు నివాసానికి నోటీసు జారి చేసిన జగన్ సర్కార్

 


భారీ వర్షాలు, వరదలతో విజయవాడలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తండడంతో కరకట్ట లోపల వైపు ఉండే నివాసాలకు వై.ఎస్. జగన్  ప్రభుత్వం మరోసారి నోటీసులు జారి చేసింది. ఇందులో భాగంగా మంగళవారం మధ్యాహ్నం తెలుగు దేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఇంటికి కూడ మరోసారి నోటీసు ఇచ్చారు. చంద్రబాబుతో పాటు మొత్తం 36 మందికి వరద ప్రమాదం హెచ్చరికలుజారి చేస్తూ నోటీసులు అం చేశారు. బారి వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద నీరు పోటెత్తుతోంది.  విజయవాడ నగరంలో లోతట్టు ప్రాంతాలు అనేకం జలమయ మయ్యాయి.

ప్రకాశం బ్యారేజీకి ప్రస్తుతం రెండున్నర లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండగా.. అది 6 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉండటంతో అధికారులు చెప్పారు. ఈ నేపద్యంలో కరకట్ట పరిదిలో ఉన్న ఇండ్లలో ఖాళి చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారి చేశారు.  రెవెన్యూ అధికారులు ప్రత్యేకంగా ఆ ప్రాంతంలో ప్రమాద హెచ్చరికలు చేసారు. ఏ క్షణంలో నైనా వరద ముంచెత్తవచ్చని హెచ్చరించారు. గతంలోచంద్రబాబు నాయుడుకు నోటీసు జారి చేయగా కావాలనే కృష్ణ నది కి వరద పెరిగేలా ప్రకాశం బారేజి గేట్లు మూసారని తెలుగు దేశం పార్టి నేతలు ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ఇళ్ళు వరద నీటిలో మునిగేందుకే ఇట్లా చేశారని విమర్శించారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు