వర్షాలతో వణికి పోయిన షహర్ - వర్ష భీభత్సం అంతా ఇంతా కాదు

 


కుంభ వృష్టిగా కురుసిన భారి వర్షాలతో  వరదలు పోటెత్తడంతో చార్ సౌ సాల్ కా షహర్ హైదరాబాద్ వణికి పోయింది.  వరద ఉధృతికి రహదారులు కొట్టికు పోయాయి. రాష్ర్టంలో పలు జిల్లాల నుండి హైదరాబాద్ ను కలిపే ప్రధాన రహదారులు పలు చోట్ల తెగి పోయాయి. భారి వర్షాల కారణంగా పలు చోట్ల 12 మంది  వరకు చనిపోయారు. కార్లు కొట్టుకు పోయాయి. భారి వాహనాలు రోడ్లపైనే కుంగి పోయి భూముల్లోకి కూరుకు పోయాయి. కాలనీలు జలమయమై వరద నీటిలో దిగ్భందం అయ్యాయి.  కని వీని ఎరుగని రీతిలో వర్షభీభత్సం జరిగింది. మంత్రి కేటీఆర్ నగరంలో పలు ప్రాంతాలలో పర్యటించారు.  నగరంలో పలు చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసారు.  భారి వర్షాలకు ఇండ్లలోకి నీరి చేరి పోయి నిద్రాహారాలులేకుండా గడిపారు. మూడు రోజుల నుండి నగర వాసుల తిప్పలు  అన్ని ఇన్ని కావు.  నగరానికి జరిగిన నష్టం ఇప్పుడప్పుడే లెక్కలు కట్టలేని పరిస్థితి నెల కొంది.

ఆగ్రహంతో ఉన్న ప్రజలు మంత్రి కెటిఆర్ ముందు తమ ఆగ్రహం వ్యక్తం చేసారు. బైరామల్‌గూడ, హబ్సిగూడ ప్రాంతాలలో కెటిఆర్ పర్యటించినపుడు స్థానికులు ఆగ్రహం బయట పడింది. సాగర్ రోడ్డుపై బైటాయించి నిరసన వ్యక్తం చేసారు. స్థానిక ప్రజా ప్రతినిధులు ఎవరూ పట్టించు కోక పోవడం వల్లే నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారని అందరూ స్థానికంగా ఉండి ప్రజల అవసరాలు తీర్చాలని కెటిఆర్ ఆదేశించారు. 

ప్రభుత్వం అ్నని విధాలా ఆదు కుంటుందని కెటిఆర్ హామి ఇచ్చారు. మరో రెండురోజుల పాటు నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు