ఉత్తరప్రదేశ్‌ మరో దారుణం... సివిల్స్ పరీక్ష జరుగుతుండగానే బాలికపై అత్యాచారంవరుస అత్యాచార ఘటనలతో ఉత్తరప్రదేశ్‌ అట్టుడుకుతోంది.
అదేమో కాని యోగి పాలిస్తున్న ఉత్తరప్రదేశ్ లో హాథ్రాస్ ఘటన మరిచిపోక ముందే రోజుకో అత్యాచార ఘటన ఏదో ఓ చోట జరుగుతున్నది

మొన్నటి హాథ్రస్‌ వేడి చల్లారకముందే మరో బాలికపై అత్యాచారం జరిగింది. అదీ విద్యాలయంలో ఓ వైపు యూపీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష జరుగుతుండగా మరోవైపు దుండగులు తెగబడ్డారు.
ఈ అకృత్యానికి కాన్పూర్‌లోని ఝాన్సీ కాలేజీ వేదికైంది. ఓ 17 ఏళ్ల యువతి తన క్లాస్‌మేట్‌ను కలిసేందుకు ఆదివారం ఝన్సీ కాలేజీ ప్రాంతానికి వెళ్లింది. 12 మంది యువకులు ఆ బాలికపై దాడిచేసి, ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడగా మిగిలినవారు ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆ దృశ్యాలను వీడియో తీ శారు. విషయం బయటపెడితే ఆ వీడియోను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తామని బెదిరించారు. పరీక్ష కేంద్రం వద్ద విధి నిర్వహణలో ఉన్న పోలీసులు ఆ బాలిక ఏడుపు విని అక్కడకు చేరుకున్నారు.
పోలీసులను చూసి నిందితులు పారిపోయారు. బాలికను పోలిస్ స్టేషన్ కు తీసుకెళ్లి విచారించగా.. ఆమె జరిగిన దారుణా న్ని వివరించింది. ఈ ఘటనలో 8 మంది నిందితులను అరెస్టు చేశారు. నిందితులంతా ఆ కాలేజీలో డిగ్రీ విద్యార్థులేనని ప్రిన్సిపాల్‌ నిర్ధారించారు పోలీసులు తెలిపారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు