ఊరూరా బతుకమ్మ సంబరాలు - సర్కార్ ఏర్పాట్లు చేయక పోయినా అగని బతుకమ్మ ఆట - పాటలు

మంత్రి .యెర్రబెల్లి దయాకర్ రావు బతుకమ్మను మోస్తూ గట్టికల్ గ్రామంలో 

గత ఆరు నెలలుగా కరోనా మహమ్మారి జన జీవనాన్ని చేసిన కట్టడి బతుకమ్మ  ఆటల పాటల ద్వారా పటా పంచలైంది. కరోనా బూచి చూపి సర్కార్ ఎక్కడా బతుకమ్మ వేడుకలకు అధికారికంగా ఏర్పాట్లు చేయక పోయినా మహిళలు బతుకమ్మ సాంప్రదాయాన్ని వీడ బోమంటూ ఆటపాటలతో సద్దుల బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. పోయిరా బతుకమ్మ పోయిరా మంటూ  తీరొక్క రంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళలు ఆడి పాడి జలాశయాల్లో నిమజ్జనం చేసారు. కొన్ని చోట్ల మహిళలు వ్యక్తిగత దూరం కూడ పాటించ లేదు. గుంపులు గుంపులుగా ఎప్పటి లాగే బతుకమ్మ ఆడే చెరువులు, కుంటలు, ఇతర జలాశయాలకు చేరుకుని బతుకమ్మ ఆడారు. 

కరోనా  వైరస్ నియంత్రణకు బతుకమ్మ వేడుకలకు మహిళలు దూరంగా ఉండాలంటూ ప్రభుత్వ యంత్రాంగం చేసిన విజ్ఞాపనలను మహిళలు పట్టించు కోలేదు. ప్రతి ఏటా ఆడిన విధంగానే బతుకమ్మలను ఆడారు. మద్యాహ్నం 3 గంటల నుండే ఆట పాటలు మొద లయ్యాయి.

హన్మకొండ పద్మాక్షి గుట్ట సమీపంలో ప్రతి ఏటా ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు జరుగుతాయి. ఈ సారి  ఏ ర్పాట్లు చేయక పోయినా మహిళలు భారి సంఖ్యలో ఆటపాటల్లో పాల్గొన్నారు. మహిళల  ప్రవాహం చూసి విధి లేని పరిస్థితుల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేసారు. అప్పటి కప్పుడు విద్యుత్ దీపాలు ఏర్పాట్లు చేసారు.  

ములుగు ఎమ్మెల్యే సీతక్క తన స్వగ్రామం జగ్గన్నపేటలో 


పంచాయితి రాజ్ శాఖ మంత్రి యెర్రబెల్లి దయాకర్ రావు తన స్వంత గ్రామం అయిన పర్వత గిరిలో బతుకమ్మ వేడకల్లో పాల్గొన్నారు. రాయపర్తి లో బతుకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గట్టికల్ గ్రామంలో మంత్రి బతుకమ్మను నెత్తి నెత్తుకున్నాడు. 

వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బతుకమ్మ విగ్రహాలు ఆవిష్కరించారు.

ములుగు ఎమ్మెల్యే సీతక్క తన స్వగ్రామం జగ్గన్నపేటలో గ్రామ మహిళలతో కలిసి బతుకమ్మను పేర్చి ఆడారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు