విదేశి ప్రయాణాలపై ఆంక్షలు సడలించిన కేంద్రం

జలవాయి మార్గాలలో ఇక రాకపోకలు కొనసాగించవచ్చు- కోవిడ్ నిభందనలు మాత్రం విధిగా పాటించాలి


కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుండి అంజర్జాతీయ రాకపోకలు నిలిపివేసిన కేంద్రం క్రమంగా వాటిని సడలిస్తోంది. ఇకపై రాక పోకలు సాగించవచ్చని  జల, వాయి మార్గాలపై అమలు అవుతున్న ఆంక్షలు సడలిస్తు నిర్ణయం తీసుకుంది.

పర్యాటక విసాలకు మాత్రం ఇంకా అనుమతులు ఇవ్వలేదు. ఇతర అన్ని రకాల విసాలకు అనుమతులు ఇస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారి చేసింది. ఈ నిర్ణయంతో ఇక విదేశాలలో ఉండే భారతీయులు ఇక్కడికి వచ్చి పోవచ్చు. అట్లాగే ఇక్కడి నుండి వెళ్ళి రావచ్చు. రాక పోకల సందర్బంగా విధిగా కోవిడ్ (కరోనా) నిభందనలు పాటించాల్సి ఉంటుంది. ప్రయాణానంతరం క్వారెంటైన్ లో ఉండడం తప్పని సరి పాటించాలి. వీసాలకు గడువు ముగిసినట్లైతే తిరిగి వాటిని సంభందిత భారతీయ శాఖల్లో గడువు పొడిగించు కోవచ్చు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు