దేవి నవరాత్రుల తొలి రోజు నవ దుర్గలకు జన్మనిచ్చిన మహిళ

 

ఒకే కాన్పులో 9 మంది  ఆడ శిశువులు
ముగ్గురు మగ శిశువులకు జన్మనిచ్చిన మహిళ


దేవి శరన్నవ రాత్రుల ప్రారంభం తొలి రోజు మహారాష్ట్రలో ఓ మహిళ 11 మందికి జన్మనిచ్చింది. జన్మించిన వారిలో  9 మంది ఆడ శిశువులుకాగా ముగ్గుుర మగ శిశివులు ఉన్నారు.

ధానె జిల్లాలో కళ్యాన్ పట్టణంలోని వైష్ణవి ఆసుపత్రిలో 11 మంది సంతానానికి జన్మనిచ్చిన మహిళను చాలా మంది అబినందించారు. ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కక్కర్ 11 మంది శిశువుల ఫోటోను ఫేస్ బుక్ లో షేర్ చేయడంతో అభినందనలు వెల్లువెత్తాయి. నవ రాత్రుల మొదటి రోజు 9 మంది ఆడ శిశువులు జన్మించడంతో నవ దుర్గలు  జన్మించారని కామెంట్సు  లో పేర్కొన్నారు. గత 18 సంవత్సరాలుగా ఆసుపత్రి నడుస్తోందని ఒకే కాన్పులో 11 మంది జన్మించడం ఇదే మొదటి సారని డాక్టర్ కక్కర్ తెలిపారు. తల్లితో పాటు శిశువులు అందరూ ఆరోగ్యంగా ఉన్నారని ఆయన తెలిపారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు