మామను హత్య చేసిన అల్లున్ని అరెస్ట్ చేసిన పోలీసులు

 


పిల్ల నిచ్చిన మామను గొడ్డలితో నరికి శవాన్ని చెరువులో పడవేసిన అల్లున్ని గురువారం హసన్ పర్తి పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుడి నుండి  ఒక గొడ్డలితో పాటు ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ నెల 9వ తేదిన హసన్ పర్తి చెరువులో గుర్తు తెలియని శవం కనిపించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తులో అసలు నిందితున్ని పట్టుకున్నట్లు
హసన్ పర్తి ఇన్స్పెక్టర్ శ్రీధర్ రావు
తెలిపారు.
వరంగల్ రూరల్ జిల్లా, నడికుడి గ్రామం, కంఠాత్మకూర్ గ్రామానికి చెందిన జక్కి ఎల్లయ్య తన కూతురును హసన్ పర్తి కి చెందిన పొతరాజు వెంకటేశ్ కు ఇచ్చి వివాహం చేశాడు. అల్లుడు తన కూతురును ఈ మద్య తరుచూ హింసిస్తున్నాడని తెల్సి వాస్తవాలు తెలుసుకునేందుకు అక్టోబర్ 6 వ తేదీన కూతురు ఇంటికి వెళ్లాడు. తెల్లవారి సాయంత్రం మామకు మద్యం తాగించి మర్యాద చేసేందుకు హసన్ పర్తి లోని నల్లగుట్టకు తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరూ కల్సి మద్యం తాగిన తర్వాత మామ అల్లున్ని తన కూతురుని ఎందుకు కొడుతున్నావని ఎందుకు సరిగా చూసుకోవడం లేదంటూ నిలదీశారు. దాంతో ఇద్దరి మద్య మాట మాట పెరిగి గొడవకు దారి తీసింది.

అంతటితో అల్లుడు తన దగ్గరున్న గొడ్డలితో మామ పై దాడి చేయడంతో మామ తీవ్రంగ గాయపడి అక్కడే స్పృహ కోల్పోయారు. సాక్షం లేకుండ చేసేందుకు హసన్ పర్తి చెరువులో పడేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని సిఐ తెలిపారు. నిందితున్ని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుచగా రిమాండ్ చేసినట్టు చెప్పారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు