సిఎం కెసిఆర్ పై నిప్పులు చెరిగిన బిజెపి అధ్యక్షులు బండి సంజయ్

కరోనా భారిన పడి ఢిల్లీలో 20 రోజుల పాటు హోం క్వారెంటైన్ లో ఉండి చికిత్స పొందిన బండి సంజయ్ శనివారం నేరుగా డిల్లీ నుండి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం ఆతర్వాత వేముల ఆలయం సందర్శించారు


బిజెపి  అధ్యక్షులు బండి సంజయ్ సిఎం కెసిఆర్ పై నిప్పులు చెరిగారు. కెసిఆఆర్ ఒకే ఒక వర్గ ప్రయోజనాలకోసం పనిచేస్తున్నారని విమర్శించారు. మున్సిపల్ ఎ్ననికలల్లో ఇద్దరి కన్నా మించి సంతానం కలిగిన వారికి ఓటు హక్కు కల్పించేందుకు చట్టం తీసుకువచ్చే ఉద్దేశంతో అసెంబ్లి సమావేశం ఏర్పాటు చేసారని విమర్శించారు. 

కరోనా పాజిటివ్ కారమంగా 20 రోజులపాటు డిల్లీలో హౌం క్వారెంటైన్ లో ఉండి చికిత్స తీసుకుని కోలుకున్న సంజయ్ శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆలయాలు సందర్శించారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలంతో పాటు వేములవాడ రాజరాజేశ్వరి ఆలయం సందర్శించి పూజలు చేసారు. దేవుళ్ల దీవెనలు తన 

కేసీఆర్ లాంటి వాళ్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్య మని  ఆవేదన వ్యక్తం చేశారు. 13, 14 తేదీల్లో అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి ముగ్గురు కంటే ఎక్కువ సంతానం ఉన్నవాళ్లకు కూడ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తారట… కేవలం ఓ వర్గానికి, దేశ ద్రోహ ఎంఐఎంకు కొమ్ముకాసే విధంగా కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ కు దిమ్మతిరిగే విధంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హిందువులంతా ఒక్కటి కావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.  ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఉపాధి లేక వీధిన పడ్డవారి కోసం, నిరుద్యోగులు, రైతులు సమస్యలు చర్చించేందుకు అసెంబ్లీ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.  ఆస్తుల నమోదు అంటూ సామాన్య ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాడని విమర్శించారు. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ముందుగా తమ ఆస్తులను ప్రకటించిన తర్వాతే ప్రజలు ఆస్తుల వివరాలను వెల్లడించాలని సూచించారు. పూర్వం నుంచి తమకు సంక్రమించిన ఆస్తులను ప్రజల నుంచి లాక్కోవడానికే ఈ కార్యక్రమం చేపట్టారని ఆయన విమర్శించారు.


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు