ఔషధం వచ్చే వరకు కరోనాను అశ్రద్ద చేయవద్దు - ప్రధాన మంత్రి నరేంద్ర మోది

 వీడియో కాన్ఫరెన్సు ద్వారా బాలా సాహెబ్ విఖే పాటిల్ ఆత్మకథ పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోది

ఔషదం వచ్చే వరకు అశ్రద్ద దగదన్న ప్రధాని - మాస్కులు భౌతిక దూరం పాటించాలని హితవు


దేశంలో కరోనా మహమ్మారితో ముప్పు ఇంకా తగ్గ లేదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోది హెచ్చరించారు. ఔ,ధం వచ్చేంత వరకు ప్రజలు అప్రమత్తంగా ఉడాల్సిన అవసరం ఉందని అన్నారు.

మంగళవారం బాలా సాహెబ్ విఖే పాటిల్ ఆత్మకథ పుస్తకాన్ని ప్రధాన మంత్రి ఆవిష్కరించారు. వీడియోకాన్పరెన్సు ద్వారా జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో మహారాష్ర్ట ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే కూడ పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా కరోనా పరిస్థితి కొంత తగ్గు ముఖం పట్టినట్లు కనిపిస్తున్నా మహారాష్ర్టలో మాత్రం వైరస్ ఆందోళన కరంగా ఉందని అన్నారు.

'కరోనా వైరస్ ప్రమాదం ఇంకా తొలిగి పోలేదు..మహారాష్ర్టలోపరిస్థితి మరింత ఆందోళన కరంగా ఉంది..ఈ పరిస్థితులలో ప్రజలు మాస్కులు ధరించడంతో పాటు బౌతిక దూరం పాటించాలని ఎలాంటి పరిస్థితులలో నిర్లక్ష్యం తగదని ..ఔషధం వచ్చే వరకు అజాగ్రత్త వహించరాదని ' నరేంద్ర మోది అన్నారు.

మహారాష్ర్ట లో కరోనా 15 లక్షలు దాటింది. వైద్యం  చేయించుకున్న వారిలో 12 లక్షల 80 వేల మంది కోలుకున్నారు. రాష్ర్టంలో 2 లక్షలవరకు ఆక్టివ్  కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా లక్షా 9 వేల మంది కరోనా బారిన పడి చనిపోగా మహారాష్ర్టలో అత్యదికంగా 40,514 మంది మృత్యువాత పడ్డారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు