పది పైసలకే ప్లేటు బిర్యాని - ఎగబడ్డ జనం - కేసులు పెట్టిన మున్సిపల్ అధికారులు

 అక్టోబర్ 11 బిర్యాని డే అని కస్టమనర్ల కోసం   బిర్యాని హౌ జులు పోటీలు పడి ఆఫర్లు ప్రకటించాయి.. కేవలం పది పైసలకే ప్లేట్ బిర్యాని అందించారు..చివరికి కేసుల్లోఇరుక్కున్నారు

కోవిడ్ నిభందనలు ఉల్లంఘించారని భిర్యాని హౌజ్ ల యజమానులపై మున్సిపల్ అధికారులు కేసులు నమోదు చేసారు.


భోజన ప్రియులకు బిర్యాని పై మోజు అంతా ఇంతా కాదు. బిర్యాని పొట్లం కోసం ఎంత రిస్కు అయినా పడతారు. ఒక్క్ సిరా ఈ బిర్యానికి అలవాటు పడితే ఇక మానరు గాక మానరు. అందుకే తమిళ నాడులో కస్టమర్లను ఆకట్టుకునేందుకు బిర్యాని హౌజ్ లు పోటీలు పడ్డాయి. కిలోమాటర్ల

మేరకు జనం క్యూలు కట్టారు. అఖరికి యజమానలపై కేసులు నమోదయ్యాయి.

. ప్లేటు వంద రూపాయలు, యాభై రూపాయలు, పది రూపాయలు అంటూ రకరకాల ఆఫర్ల గురించి విన్నాం. అయితే ఇప్పుడు ఓ హోటల్ ఏకంగా10 పైసలకు బిర్యానీ ఆఫర్ చేసింది.

ఈ రోజు (అక్టోబర్‌ 11) బిర్యానీ డే. ఈ సందర్భంగా తమిళనాడు బిర్యానీ వ్యాపారులు భారీ ఆఫర్లను ప్రకటించారు. తిరుచ్చి, మధురై, దిండిగల్, చెన్నై నగరాలలో 10 పైసలకే బిర్యానీ అమ్మకాలు నిర్వహించారు. దీంతో భారీగా జనం ఎగబడ్డారు. బిర్యానీని అందుకునేందుకు కిలోమీటర్ల మేర బారులు తీశారు.

కరోనా నిబంధనలను పట్టించుకోకుండా బిర్యానీ కోసం స్థానికులు క్యూకట్టారు. ఇది కాస్తా అధికారుల దృష్టికి చేరడంతో వారు సీరియస్ అయ్యారు. కోవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించి బిర్యానీ ఆఫర్లను ప్రకటించిన వ్యాపారులపై మున్సిపల్‌ అధికారులు కేసు నమోదు చేశారు. 

మరోవైపు బెంగళూరులోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌ సైతం భారీ ఆఫర్ ప్రటించింది. దీంతో ఉదయం 4 గంటల నుంచే బిర్యానీ కోసం జనం క్యూ కట్టారు. దాదాపు 1.5 కిలో మీటర్ల మేర బిర్యానీ ప్రియులు బారుతీరుతారు. అక్కడ ప్రతి ఆదివారం ఇదే సీన్ కనిపిస్తుంది. కనీసం కరోనా నిబంధనలను కూడా వారు పాటించలేదని స్థానికులు అంటున్నారు. 


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు