వరదలో కొట్టుకు వచ్చి న నగల మూటను కొట్టేసిన నిందితుల అరెస్టు

 కోటి విలువైన సొత్తు స్వాదీనం


ప్రమాదవ శాత్తు చేజారి వరదనీటి ప్రవాహములో కొట్టుకు పోతున్న నగల మూటను కొట్టేసిన నిందితులను బంజారాహిల్స్‌ పోలీసులు గురువారం అరెస్టు చేసారు. వారి నుంచి రూ.కోటి విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ మీడియా సమావేశంలో  తెలిపారు. 

ఎట్లా ఇదంత జరిగిందని కమీషనర్ వివరించాడు. జూబ్లీహిల్స్‌లోని కృష్ణ జ్యువెలర్స్‌లో పనిచేస్తున్న ప్రదీప్‌ కుమార్‌ ఈ నెల 9వ తేదీ సాయంత్రం 143 గ్రాముల వజ్రాభరణాల సంచిని తీసుకుని ద్విచక్ర వాహనంపై బషీర్‌బాగ్‌కు బయలుదేరాడు. మార్గమధ్యంలో బంజారాహిల్స్‌ రోడ్‌ నం.3 వద్ద ద్విచక్ర వాహనం స్కిడ్ అయి కిందపడటంతో వరద ప్రవాహంలో నగల సంచి కొట్టుకుపోయింది.
ప్రదీప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు  సంఘటనా స్థలానికి వెళ్లి చుట్టుపక్కల విచారణ జరిపారు. స్థానికంగా ఉన్న సెల్‌ఫోన్‌ టవర్‌ ఆధారంగా నంబర్లపై దృష్టి సారించారు.  అంతకు ముందు వరకు సందేశాలు వెళ్లిన ఓ నంబరు ఆ తర్వాత  స్విచ్ఛాఫ్‌ రావడంతో అనుమానం కలిగింది. ఆ నంబరు ఆధారంగా అక్కడే గుడిసెల్లో ఉంటున్న నాగర్‌ కర్నూల్‌ వాసులు అనుమానం కలిగి విచారించారు.పైగా వారు స్థానికంగ లేక ఉరెళ్లారని తెలియడంతో అనుమానం మరింత బలపడింది. ఈ నెల 21న నాగర్‌ కర్నూల్‌ జిల్లాలోని తుర్కపల్లి గ్రామానికి వెళ్లి నిరంజన్‌ అనే వ్యక్తిని విచారించగా తానే సంచిని తీసుకున్నట్లు అంగీకరించాడు. బాలపీర్‌, రంజిత్‌, వెంకటయ్యలతో కలిసి వాటాలను పంచుకున్నట్లు వెల్లడించాడు. కొన్ని నగలు బంధువుల ఇళ్లల్లో దాచి పెట్టి కొన్ని ఆభరణాలను కుమార్‌ రాజన్‌ అనే వ్యాపారికి అమ్మినట్లు వివరించాడు. పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఫరారీలో ఉన్న కుమార్‌ రాజన్‌ కోసం గాలిస్తున్నారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు