డాక్టర్ కిడ్నాప్ కేసు సుఖాంతం-అనంతపురంలో అడ్డగించి పట్టుకున్న పోలీసులు


 హైదరాబాద్ లో కిడ్నాప్ అయిన డెంటల్ డాక్టర్ కేసు సుఖాంతం అయ్యింది. అనంతపురం పోలీసులు కిడ్నాపర్ల కారును అడ్డగించి పట్టుకున్నారు. కిడ్పాపర్లలో ఒకరిని అదుపు లోకి తీసుకోగా మిగతా వారుపారి పోయారు.

రాజేంద్ర నగర్ పోలీస్ స్టే,న్ పరిధి లోని కిస్మత్ పురా లో అపార్ట్ మెంట్ నుండి డాక్టర్ బెహజాత్ హుస్సేన్ (58) ను బురఖాలు ధరించి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు మిట్ట మద్యాహ్నం కిడ్నాప్ చేసారు. ఐదారుగురు వ్యక్తులు  డాక్టర్ క్లినిక్ కు వచ్చి ముందు ఆతని సహాయకుడిని కొట్టి కాల్లు చేతులు కట్టి పడేసి మూతికి ప్లాస్టర్ వేసి మరుగు దొడ్డిలోపడేసారు. అ తర్వాత డాక్టర్ ను కొట్టి అతన్ని ఈడ్చుకుంటూ తీసుకు వెళ్లి అతని కారులోనే  కిడ్నాప్ చేసారు.  కొద్దిసేపటి తర్వాత మరుగు దొడ్డిలో పడి ఉన్న డాక్టర్ సహాయకుడు కట్లు విప్పుకుని బయట పడి కిడ్నాప్  విషయాన్ని డాక్టర్ కుటుంబ సబ్యులకు తెలియ చేసాడు. 

ఈ కిడ్పాప్ కేసు నగరంలో కల కలం రేపింది. సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్ కిడ్నాప్ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. కమీషనర్ ఆదేశాల మేరకు  తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల పోలీసులను కూడ అప్రమత్తం చేసారు. కారు నెంబర్ తో పాటు వివరాలు తెలిపారు. మద్యాహ్నం 1.30 గంటల సమయంలో కిడ్నాప్ జరగగా పోలీసులు తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న అన్ని చెక్ పోస్టుల దగ్గర చెకింగ్ చేసినా కిడ్నాపర్ల కారు దొరక లేదు. పోలీసుల కంట పడకుండా కిడ్నాపర్లు తెలంగాణ సరిహద్దులు దాటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని జాతీయ రహదారి గుండా  బెంగుళూరు వెళుతుండగా రాప్తాడు వద్ద అనంతపురం పోలీసులు దారి కాచి అడ్డం తిరిగి పట్టుకున్నారు.

వాహనంలో వెనక సీటు కింద కట్టి పడేసి ఉన్న డాక్టర్ ను పోలీసులు కాపాడారు. ఓ కిడ్నాపర్ ను అదుపులోకి తీసు కోగా కారులో వచ్చిన మిగతా ముగ్గురు పారి పోయారు. డాక్టర్ ను హైదరాబాద్ కు తీసుకు వచ్చేందుకు తెలంగాణ పోలీసులు వెళ్లారు. ఎందుుక కిడ్నాప్ చేశారు..కారణాలు ఏమిటనే విషయాలు తెలయాల్సి ఉంది. డెంటల్ డాక్టర్ అయిన హుస్సేన్ వైద్యంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. 

ఆస్తి తగాదాలే కిడ్నాప్ వ్యవహారానికి కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం.


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు