గొంతు నులిమి చంపిన తర్వాతే డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేసిన కిడ్నాపర్

నాలుగు రోజుల పాటు హై డ్రామా కొనసాగించిన కిడ్నాపర్ 
స్కైప్ కాల్ ఆధారాలతో నిందితుని ఆచూకి కనుగొన్న పోలీసులు
200 మంది పోలీసులకు చుక్కలు చూపించిన కిడ్నాపర్


మానుకోటలో 9 సంవత్సరాల దీక్షిత్ రెడ్డి అనే బాలుడి కిడ్నాప్ ఉదంతం విషాదంగా ముగిసింది. బాలున్ని కాడ్నిప్ చేసిన తర్వాత  గొంతు నులిమి హత్య చేసి ఆ తర్వాత డబ్బుల కోసం కిడ్నాపర్ బ్లాక్ మెయిల్ చేసాడని ఎస్పి కోటిరెడ్డి వెల్లడించారు. మానుకోటకు సమీపంలోని శనిగాపురం కు చెందిన మంద సాగర్ ఆనే మెకానిక్ ఈ కిడ్నాప్ కు పాల్పడి బాలున్ని అదుపు చేయడం సాధ్యం కాక హత్య చేశాడని ఎస్పి చెప్పారు. 

పోలీసులు ఎంతో రిస్క్ తీసుకుని బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినా లాభం  లేక పోయింది. ఆదివారం సాయంత్రం బాలున్ని కిడ్నాప్ చేసి టూ వీలర్ పై తీసుకు వెళ్లిన సాగర్ అతన్ని నియంత్రించడం కష్టంగా భావించి గంటన్నరకే బాలున్ని గొంతు నులిమి చంపాడు. అ తర్వాత మహబూ బాబాద్ కు సమీపంలోని అన్నారం శివారులోని గుట్టు పైకి తీసుకు వెళ్లి మృత దేహాన్ని పడేసి ఆనవాళ్ళు  లేకుండా చేసేందుకు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 

కిడ్నాపర్ బాలున్ని పట్టణం నుండి తీసుకు వెళ్లే సమయంలో ఎక్కడా సిసి కెమెరాల కంట పడకుండా జాగ్రత్త పడ్డాడు. కలెక్టర్ కార్యాలయం దగ్గరి సిసి కెమెరాలో మాత్రం కిడ్నాపర్ దృష్యాలు రికార్డ్ అయినట్లు పోలీసులు గుర్తించారు.


స్కైప్ కాల్ ఆధారంతో కిడ్నాపర్ ను గుర్తించిన పోలీసులు



కిడ్నాపర్ బాలుడి తల్లి దండ్రులకు మొబైల్  ఫోన్లో కాకుండా ఇంటర్నెట్ పోన్ ద్వారా మాట్లాడడం పోలీసులకు త్వరిత గతిన గుర్తించడం సాధ్యం కాలేదు. 200 మంది ప్రత్యేక బృందాలతో పాటు హైదరాబాద్ నుండి వచ్చిన స్పెషల్ సైబర్ క్రైం టాస్క్ ఫోర్స్ టీం నిద్రాహారాలు మాని  శ్రమించి చివరికి నిందితున్ని పట్టుకున్నారు. గురువారం తెల్లవారు జామున నిందితున్ని పట్టుకుని విచారించగా గుట్టపై బాలున్ని హత్య చేసినట్లు నిందితుడు చెప్పిన వివరాల మేరకు పోలీసులు ఆ ప్రదేశాన్ని గుర్తించారు.  

బాలుడి తల్లి దండ్రుల నుండి 45 లక్షలు డిమాండ్ చేసిన కిడ్నాపర్ ఆ డబ్బు ఇస్తే క్షేమంగా వదిలేస్తానని చెప్పి సిద్దం చేసుకున్న డబ్బు తనకు వీడియో కాల్ లో చూపించాలంటూ బెదిరించాడు. దాంతో బాలుడి తల్లి సిద్దం చేసిన డబ్బును స్కైప్ ద్వారా కిడ్నాపర్ కు చూపించింది. ఆ డబ్బు తీసుకుని బాలుడి తండ్రి కిడ్నాపర్ చెప్పిన ప్రదేశానికి వెళ్లి బుధవారం సాయంత్రం ఎదురు చూసాడు కాని కిడ్నాపర్ ఆ ప్రదేశానికి రాక పోవడంతో ఇంటికి తిరిగి వచ్చాడు.

బాలున్ని కాపాడేందుుక పోలీసులు చాలా కృషి చేశారు. కాని బాలున్ని కిడ్నాపర్ కిడ్నాప్ చేసిన గంటన్నర లోపే హత్య చేసి ఆ విషయం తెలియకుండా బాలుడు ఇంకా తన దగ్గరే క్షేమంగా బతికే ఉన్నట్లు నమ్మిస్తు డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేయడం వల్ల చివరి వరకు పోలీసులు బాలున్ని కాపాడేందుకు శత విధాలా ప్రయత్నించారు.


ఎన్ కౌంటర్ చేయలేదన్న  ఎస్పి 


బాలున్ని హత్య చేసిన కిడ్నాపర్ మంద సాగర్ ను ఎన్ కౌంటర్ చేశారని మానుకోటలో ప్రచారం జరిగింది. అయితే కిడ్నాపర్ ఎన్ కౌంటర్ కాలేదని అతనికి ఉరి శిక్ష పడేలా చేస్తామని అందుకోసం సాక్షాలు సేకరిస్తున్నామని   ఎస్పి తెలిపారు. కేసులో సుమారు 30 మంది వరకు విచారించామని బాలుడి తండ్రి రంజిత్ రెడ్డి స్నేహితుడు జితాందర్ రెడ్డి తోపాటు అనుమానితులందరిని విచారించామని ఆయితే బాలున్ని హత్యోదంతంలో ఇతరుల ప్రమేయం లేదని కిడ్నాపర్ సాగర్ ఒక్కడే బాలున్న హత్య చేశాడని ఇంకా విచారణ జరుగుతోందని తెలిపారు.

బాలుడి హత్య వార్తతో పట్టణంలో కోపోద్రిక్తు లయ్యారు. కిడ్నాపర్లను ఎన్కౌంటర్ చేసిచంపాలని డిమాండ్ చేసారు. బాలుడి తల్లి దండ్రులను ఓదార్చడం ఎవరికి సాద్యం కాలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు