భర్త ఫొటో కటౌట్ తో నటి మేఘనా రాజ్‌ సీమంతం - భావోద్వేగంలో అభిమానులు

 కొద్ది నెలల క్రితం పఠాత్తుగా చనిపోయిన చిరంజీవి
పుట్టింట్లో కుటుంబ సబ్యుల మద్య సీమంతం 
సీమంతంలో  పక్కన భర్త ఫోటో కటౌట్ 


కొద్ది నెలలక్రితం మరణించిన ప్ర‌ముఖ క‌న్న‌డ హీరో చిరంజీవి స‌ర్జా సతీమణి నటి మేఘనా రాజ్ సీమంతం వేడుకలు భావోద్వేగంతో జరిగాయి. సీమంతం వేడుకల్లో మేఘన తన కుర్చి పక్కన భర్త ఫోటో కటౌట్ ఏర్పాటు చేసుకుని బరువెక్కిన హృదయంతో వేడుకలు జరుపుుకంది. ఈ దృష్యాలను చూసిన అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు. 

హీరో చిరంజీవి స‌ర్జా కొద్ది నెలల క్రితం ఆక‌స్మికంగా మృతి చెందాడు. శ్వాస‌కోశ సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్న చిరంజీవిని ఆయ‌న‌ కుటుంబ స‌భ్యులు ఆసుప‌త్రిలో చేర్పించ‌గా, చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. చిరంజీవి చ‌నిపోయే నాటికి మేఘ‌నా రాజ్ గ‌ర్భ‌వ‌తి కావడంతో ఇప్పడు సీమంతం జరిపించారు. 

మేఘనా పుట్టింట్లో సీమంతం వేడకలు జరుగగా చిరంజీవి కుటుంబ సబ్యులు కూడ ఈ వేడుకలకు హాజరయ్యారు. మేఘనా సీమంతం వేడుకలు నెట్ లో వైరల్ గా మారాయి. మేఘన వేడుకల ఫోటోలు చూసి అభిమానులు శుభాకాంక్షలు తెలియ చేసారు. పుట్ట బోయే బేబీకి దేవుడి ఆశీస్సులు ఉంటాయని అభిమానులు గ్రీటింగ్స్ చెప్పారు. మేఘనా చిరంజీవిది ప్రేమ వివాహం. 1918 లో వారి వివాహం జరిగింది.


కన్నడంలో 19 సినిమాల్లో హీరోగా నటించిన‌ చిరంజీవి సర్జా.  ప్రముఖ నటుడు అర్జున్‌కు మేనల్లుడు. అర్జున్‌ దగ్గర నాలుగు సంవత్సరాలు సహాయదర్శకుడిగా పనిచేసిన చిరంజీవి ‘వాయుపుత్ర’ సినిమాతో హీరోగా అరంగేట్రం చేశారు. తొలి సినిమాతోనే మంచి నటుడిగా పేరుతెచ్చుకున్నారు. చంద్రలేఖ, విజిల్‌, రుద్రతాండవ, రామ్‌లీలా, అమ్మ ఐ లవ్‌ యూతో పాటు పలు చిత్రాలలో  హీరోగా నటించగా  మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. 

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు