భూతగాదాల్లో తలదూర్చిన సిఐ - విఆర్ కు ఆటాచ్ చేసిన కమీషనర్వరంగల్ నగరంలో  ప్రధాన పోలీస్ స్టేషన్ లలో  పనిచేసే పోలీసు అధికారులకు భూతగాదాల గొడవలు స్టేషన్ కు వస్తే పండగే. అక్రమ మార్గాలలో  ఎధిక మొత్తంలో ఆదాయం సమకూర్చి పెట్టేది బూతగాదాకేసులే. అందుకే ఎక్కువగా రిస్క్ తీసుకుని  కేసులు సెటిల్  చేస్తుంటారు. అట్లా భూతగాదాల్లో తల దూర్చి  వరంగల్ అర్బన్  లోని హన్మకొండ   సర్కిల్ ఇన్స్ పెక్టర్ దయాకర్   పోలీసు ఉన్నతాధికారులకు దొరికాడు.  పోలీస్ కమీషనర్ ప్రమోద్ కుమార్  అతన్ని విధుల నుండి రిలీ వ్ చేసి వెకెన్సి రిజర్వులో ఉంచారు.

ఓ భూవివాదం కేసులో  సిఐ భాదితున్ని తుపాకితో బెదిరించడమే కాక తీవ్రం చిత్ర హింసలకు గురి చేసాడు. చెప్పినట్లు వినక  పోతే చంపుతానంటూ రివాల్వర్ తో బెదిరించాడు. భాదితుడు ఉ్నతాధి కారులకు ఫిర్యాదు చేయడంతో కమీషనర్ సీరియస్ అయ్యాడు. సిఐ పై అదే పోలీస్ స్టేషన్ లో హత్యానేరంతో పాటు దారి దోపిడికేసు నమోదు చేసారు. కేసు పై  శాఖ పరమైన విచారణ అనంతరం సిఐ ని సస్పెండ్  చేసే అవకాశాలు ఉన్నాయి. 

భూతగాదాలలో తల దూర్చద్దంటూ కమీషనర్  హెచ్చరిక

పోలీసు అధికారులు భూ తగాదా కేసుల్లో తల దూర్చద్దంటూ హెచ్చరించారు.  సివిల్ తగాదాల పై ఫిర్యాదులు అందితే  జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. అధికారులే స్వయంగా తల దూర్చితే   చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు