మార్చి నాటికి కరోనా మాయం అవుతుందా ?

 పరిస్థితులు ఇలాగే కొనసాగితే
*మార్చి నాటికి* 
*కరోనా మాయం?*జాగ్రత్తలు ఇలాగే తీసుకుంటూ కరోనాను నియంత్రణలో ఉంచగలిగితే వచ్చే మార్చి నాటికి ఇండియా కరోనా రహిత దేశంగా మారుతుందన్న  ఆశాభావాన్ని కేంద్రం వ్యక్తం చేస్తోంది..దేశంలో కేరళ, తమిళనాడు,చండీఘర్ వంటి కొన్ని రాష్ట్రాలలో కేసులు పెరుగుతున్నా గత రెండు నెలలతో పోలిస్తే పరిస్థితి అదుపులో ఉన్నట్టేనని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్

అన్నారు.వాక్సిన్ వస్తుందన్న సూచనలు ఉన్నాయి గనక ఇదే తరహాలో మాస్కులు,సామాజిక దూరం వంటి నిబంధనలను మరింత పకడ్బందీగా పాటించ గలిగితే మరో ఆరు నెలల్లో కరోనాపై మన దేశం సంపూర్ణ విజయం సాధించినట్టేనని ఆయన అభిప్రాయపడ్డారు.అయితే రానున్న శీతాకాలంలో మాత్రం వైరస్ మళ్లీ ప్రబలే అవకాశాలు ఉన్నాయి గనక ఇంకా జాగ్రత్తగా ఉండాలన్న నిపుణుల సూచనను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది.

ఇప్పటికే వైరస్ అదుపులోకి వచ్చిందనుకున్న దేశాల్లో నిర్లక్ష్యం వల్లనైతేనేమి ఇతర కారణాల వల్లనైతేనేమి శీతాకాలం చొరబడిన తర్వాత వ్యాధి మళ్లీ ప్రబలిందనే విషయాన్ని గుర్తు పెట్టుకొని ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచిస్తోంది.అలాకాక నిర్లక్ష్యంగా వ్యవహరించి పరిస్థితి మళ్లీ చేజారి  మరోసారి లాక్ డౌన్ విధించే స్థితి వస్తే దేశం కోలుకోవడం కష్టం. 

        ఇదిలాఉండగా ఏ దేశం నుంచి వచ్చే వాక్సిన్ అయినా అందరికీ అందుబాటులోకి తెచ్చేలా జాతీయం చేస్తే మంచిదన్న భారత్ సూచనను ప్రపంచ ఆరోగ్య సంస్థ బలపరుస్తోంది.

         కాగా ఇంగ్లండ్ లో వచ్చే న్యూ ఇయర్ నాటికి వాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆ దేశంలో సెకెండ్ వేవ్ బలంగా ఉన్న నేపథ్యంలో వాక్సిన్ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నంలో బోరిస్ జాన్సన్ ప్రభుత్వం ఉంది.అలాంటి పరిస్థితుల్లో న్యూ ఇయర్ ను మించిన సుముహూర్తం ఇంకేముంటుంది.

          ఇదిలాఉండగా ఇండియాలో నాసల్ వాక్సిన్ ట్రయల్స్ త్వరలోనే ప్రారంభం కానున్నాయి.Oxford,

covaxin వాక్సిన్ల హ్యూమన్ ట్రయల్స్ లో తలమునకలై ఉన్న SII, భారత్ బయో టెక్ సంస్థలే నాసల్ వాక్సిన్ ట్రయల్స్ ను కూడా 

చేపట్టనున్నాయి.

    *ఇ.సురేష్ కుమార్*

       

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు