డొనాల్డ్ ట్రంప్ వీరాభిమాని ట్రంప్ కృష్ణ గుండె పోటుతో హఠాన్మరణంఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను దేవుడిలా భావించి పూజించిన జనగామ జిల్లాకు చెందిన  ట్రంప్ కృష్ణ ఆదివారం గుండె పోటుతో హఠాన్మరణం చెందాడు.  ట్రంప్ కు కోవిడ్ (కరోనా) పాజిటివ్ గా నిర్దారణ అయి ఆయనకు చికిత్స ప్రారంభ మైనప్పటి నుుండి కృష్ణ తీవ్ర మనోవేదనకు గురయ్యాడని గ్రామస్థులు తెలిపారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన బుస్సా సావిత్రి, రాములు దంపతుల కుమారుడు కృష్ణ 2017 నుండి అమెరికా అధ్యక్షులు ట్రంప్ కు నిత్యపూజలు చేస్తున్నాడు. మొదట్లో ట్రంప్ చిత్ర పటానికి పూజలు నిర్వహించిన కృష్ణ ఆ తర్వాత ఇంట్లోనే ప్రత్యేకంగా విగ్రహం ఏర్పాటు చేసుకున్నాడు.  విగ్రహానికి క్రమం తప్పకుండా పూజలు అభిషేకాలు నిర్వహించే వాడు, ట్రంప్ గత ఏడాది నమస్తే ట్రంప్ కార్యక్రమంలో భాగంగా మన దేశ పర్యటనకు వచ్చినపుడు ఆయనను కలిసేందుకు చాలా ప్రయత్నాలు చేసాడు. బారత ప్రబుత్వానికి లేఖ రాసాడు. అయితే కలవడం సాద్యం కాలేదు కాని తన విగ్రహం ఏర్పాటు చేసి ఆరాధిస్తున్న కృష్ణ విషయం ట్రంప్ కు చేరింది ఆయన ప్రత్యేకంగా ట్వీట్ చేసాడు కూడ. 

‘వంద కోట్ల భారతీయుల్లో క్రిష్ణ‌ నా ప్రాణ స్నేహితుడు. క్రిష్ణ‌ నా అభిమాని. అతను నా ఫొటో ల ద్వారా గొప్పశక్తిని పొందాలని ప్రార్థిస్తున్నా. క్రిష్ణను త్వరలోనే కలుస్తా’నంటూ ట్రంప్ ట్వీట్ చేసాడు. అప్పటి నుండి కృష్ణ పేరు మీడియాలో వైరల్ గా మారింది. ఆయన పేరు పక్కన ట్రంప్ పేరు చేర్చి అందరూ ట్రంప్ కృష్ణగా పిలిచే వారు.  ట్రంప్ ను అరాధించి వార్తల్లో నిలిచిన కృష్ణ హఠాన్మరణంతో  గ్రామస్థులు విశాదంలో మునిగారు.

ట్రంప్ కు ఆరాధకుడిగా మారిన  కృష్ణ వార్త ఇండియా మీడియాతో పాటు యుఎస్  న్యూయార్క్ పోస్టు లో కూడ అప్పట్లో  ప్రముఖంగా  ప్రచురించారు.  ప్రతి శుక్రవారం ఆయన పూర్తిగా ఉపవాసం ఉండి ట్రంప్ కు పూజలు చేసే వాడు. 
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు