రేపిస్టుకు టెకెట్ ఎట్లా ఇచ్చారని ప్రశ్నించిన మహిళా నేతపై దాడి చేసిన కాంగ్రేస్ నేతలు

 ఉత్తర ప్రదేశ్ లో  దారుణం - మహిళా నేతను చుట్టుముట్టి దాడి చేసారు
కొట్టి అక్కడి నుండి ఈడ్చి పడేసారు - దేశ వ్యాప్తంగా విమర్శలు

పరువుపోయిన కాంగ్రేస్ - దాడి చేసినవారిపై ఏ చర్యలు తీసుకుంటారో చూడాలి


ఓ రేపిస్టుకు టికెట్ ఎట్లా ఇచ్చారని నిలదీసినందుకు మహిళా నేతపై పార్టి నాయకులు దాడి చేసారు. మహిళ అని కూడ చూడకుండా విచక్షణా రహితంగా చితక బాదారు. సభ్య సమాజం తలదించుకునే ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ర్టంలో ఆదివారం జరిగింది. మహిళా నేతపై దాడి చేసిన సంఘటనపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. దాడి చేసిన వారిని ఖఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. 

ఉత్తర ప్రదేశ్ లోని డియోరియోలో త్వరలో జరగబోయే ఉప ఎన్నికలలో  అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ముకుంద్ భాస్కర్‌ మణికి పార్టి సమావేశంలో టికెట్ అనౌన్స్ చేశారు. రేపిస్టుకు పార్టి టికెట్ ఎట్లా అనోన్స్ చేస్తారని తారా యాదవ్‌ పార్టి నేతలను నిలదీసారు. దాంతో రెచ్చి పోయిన నాయకులు ఆమెను చుట్టు ముట్టి కొట్టారు.  అక్కడి నుండి ఆమెను ఈ డ్చేసారు. 

ఇదంతా కాంగ్రేస్ పార్టి జాతీయ కార్యదర్శి సచిన్ నాయక్ సమక్షంలో జరిగిన సమావేశంలో జరిగింది. టికెట్ ఎట్లా ఇచ్చారని తారా యాదవ్ సిచన్ నాయక్ నే అడ్గారు. ఎవరైనా మంచి నడవడి కలిగినవ్యక్తికి టెకెట్ ఇవ్వాలని కోరారు.  ఆమె ప్రశ్నిస్తుండగానే పక్కనే ఉన్న ముకుంద్ భాస్కర్‌ మణి అనుచరులు నాయకులు ఆమెపై దాడికి పూనుకున్నారు.  ఆమెను కొట్టుకుంటూ అక్కడి నుండి కొద్ది దూరం ఈడ్చేసారు.  

తారా యాదవ్ పై జరిగిన దాడిని దేశ వ్యాప్తంగా ఖండించారు. మహిళా సంగాలు తీవ్ర అగ్రహావేశాలు వెల్లగక్కాయి. ప్రశ్నించారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి వారు రాజకీయాల్లోకి ఎలా వచ్చారని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా మహిళా నేతపై దాడి సంఘటన పట్ల ప్రియాంక గాంధి, సోనియా గాంధి తీవ్రంగా స్పందించారు. విచారణ అనంతరం ఇందుుక బాద్యులైన  పార్టినేతలపై ఖఠిన చర్యలు తప్పవని అన్నారు.

మహీలా నేతపై దాడి చేసిన వారిపైకేసులు నమోదు చేసి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని  కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి డిమాండ్ చేశారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు