కవిత గెలుపు మంత్రుల్లో గుబులు - కవిత మంత్రి వర్గంలో చేరతారా ?

 


తెలుగు మీడియాలో హాట్ న్యూస్ ఏంటంటే కవిత అఖండ మెజార్టీతో స్థానిక సంస్థల ఎమ్మెల్సి ఎన్నికలలో గెలవడం ఒకటైతే ఆమెకు కాబినెట్ లో చోటు దొరుకుతుందా లేదా మరే పదవి అయినా ఇస్తారా అనే వార్తలు. ఎపి సిఎం వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వంత మీడియా సాక్షి లో కేబినెట్‌లోకి కవిత: ఎవరికి చెక్‌పెడతారు..అంటు వార్త ఇచ్చింది.  ఆన్ లైన్ మీడియాలో కూడ ఇాలాంటి వార్తలు చక్కర్లు కొట్టాయి. వాస్తవంగా కూడ కవిత ఎమ్మెల్సిగా ఘన విజయం సాధించిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఆవరించిన వార్త ఇది. కాబెనెట్ లో చేరతారా? ఎవరిని తొలగించి ఏ పోర్ట్ పోలియో ఇస్తారు ? ఇది ప్రస్తుత చర్చ.

 కవిత రెండోసారి పార్లమెంటులో అడుగు పెట్టాలని తలంచి 2019 ఎన్నికల్లో పోటికి నిలిచి బిజెపి అభ్యర్థి అరవింద్ చేతిలో పరాజయం పాలయ్యారు. అప్పటి నుండి కవిత ఏ పదవిలో లేక పోవడంతో పవర్ పాలిటిక్స్ లో యాక్టి వ్  గా ఉండలేక పోయారు. సిఎ కెసిఆర్ కూతురు కావడం వల్ల ఏదో ఒక ప్రాధాన్యత కలిగిన నామినేటెడ్ పదవి ఇస్తారని కవిత అభిమానులు చూశారు. కాని కవిత నామినేటెడ్ పదవి ఇష్ట పడడం లేదని ఎన్నికల్లో నిలిచి గెలిచి చట్టసభకు దార్జాగా వెళ్ళాలనే ఆకాంక్షను వెల్లడించారని కూడ వార్తలు వచ్చాయి. ఎమ్మెల్సి రూపంలో ఇట్లా కవితకు  ఆమె ఆశించిన శాసన సభకు కాకుండా శాసన మండలి లో అడుగు పెట్టే అవకాశం లభించింది. 

కవితకు కాబినెట్ లో చోటు ఇస్తే ఇప్పటికే బెర్తులు ఖాళీగా లేక పోవడంతో ఎవరికి ఉద్వాసన చెబుతారనే చర్చ ఆసక్తిగా మారింది. తెలంగాణ శాసన సబ్యుల సంఖ్యను బట్టి కాబినెట్ సిఎంతో సహా 18 మందికి మించకూడదు. కవితకు మంత్రి పదవి ఇవ్వాలంటే ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఎవరినో ఒకరిని తప్పించాల్సిందే. ఎస్సీ, ఎస్టి, బిసిలలో ఎవరిని తొలగిస్తారు? అనే ప్రశ్నలు తేవనెత్తుతున్నారు. 

కెసిఆర్ సిఎం గా ఆయన కుమారుడు కెటిఆర్ మంత్రిగా, అక్టింగ్ సిఎంగా అట్లాగే  అల్లుడు హరీశ్ రావు మంత్రిగా, వరుసకు మరో కొడుకు అయిన సంతోష్ మరో పవర్ సెంటర్ గా మొత్తం కెసిఆర్ ది  కుటుంబ పాలనగా మారిందని ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కవిత విషయంలో ఎవరి విమర్శలు ఏమైనా జాన్తనై అని సిఎం కెసిఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారో ననే ఆసక్తి నెలకొంది. ఇంతకూ కవిత మంత్రి పదవి తీసుకునేందుకు సిద్దంగా ఉ్ననారా?ఆమె ఆలోచనలు ఎలా ఉన్నాయి? కేవలం 18 నెలలు మాత్రమే ఉండే ఎమ్మెల్సి పదవి కాలంలో ఆమె మంత్రిగా పనిచేస్తారా లేక ఇంకా ఏదైనా పదవి కోరుకుని  భవిష్యత్ లో డరగబోయే  శాసన సభ ఎన్నికల్లో గెలిచి ఆ తర్వాతే మంత్రి పదవి చేపట్టాలన్న ఆలోచనలో ఉన్నారా ముందు ముందు తెలుస్తుంది.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు