ఎనిమిదేళ్ల చిన్నారి పై అత్యాచారం -నిందితున్ని ఆరెస్టు చేసిన పోలీసులు


పసికూనల పైన పశుత్వం ప్రదర్శిస్తున్నారు పాప భీతియనక పాపులవుతున్నారు
సూర్యాపేటలో జరిగిన దారుణం.. 

నోట్లో గుడ్డలు కుక్కి 8 ఏండ్ల చిన్నారి పై  తాపి మేస్ర్తి అత్యాచారం
నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులుదేశంలో మృగాల ఆకృత్యాలు పెచ్చరిల్లు తున్నాయి. ప్రాంత కుల మత వయోభేదం లేకుండ తెగబడు తున్నారు. ఎనిమి దేండ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వినాయక నగర్ లో తాపీ పని చేసే సత్తు రాజు అనే వ్యక్తి పక్క   ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలిక నోట్లో గుడ్డలు కుక్కి అఘాయిత్యం చేశాడు. అదే సమయంలో అమ్మాయి తండ్రి ఇంటికి రావడంతో నిందితుడు పారిపోయాడు.
అక్టోబర్ 7 న ఈ సంఘటన జరిగింది. ఇజ్జత్ పోతుందని ఈ విషయం బయటకు చెప్పుకోలేక కుమిలిపోయిన బాలిక తల్లిదండ్రులు ఆఖరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నారిని ఆస్పత్రిలో చేర్పించారు.  ఫరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు 
వెలికి అరెస్టు చేసి పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. 
నిందితున్ని కఠినంగా శిక్షించాలని, తమకు న్యాయం చేయాలని బాధితురాలి తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని కలిశారు. బాధితురాలికి న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు