దుబ్బాకలో దూకుడు పెంచిన బిజెపి - ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్

 మోతె-దౌల్తాబాద్ లో ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్
కెసిఆర్ తాత వచ్చినా  దుబ్బాకలో బిజెపి గెలుపును ఆపలేరు
రఘునందన రావు భారి మెజార్టీతో గెలవడం ఖాయం
కెసిఆర్ పాస్‌పోర్టుల  బ్రోకర్ 


దుబ్బాక ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టి దూకుడు పెంచింది.  అగ్ర నేతలు దుబ్బాకపై కేంద్రీకరించారు. రాష్ట్ర పార్టి అధ్యక్షులు బండి సంజయ్, ఇంద్ర సేనారెడ్డి, జితేందర్ రెడ్డి, వివేక్ తదితరులు దుబ్బాక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

సిద్దేపేట పోలీస్ కమీషనర్ అక్రమ అరెస్టుకు నిరసనగా బండి సంజయ్ కరీంనగర్ లో తన కార్యాలయంలో ఓక రోజు దీక్ష చేపట్టి నీరసించడంతో అతన్ని హైదరాబాదకు తరలించి చికిత్సచేసారు. చికిత్స అనంతరం బండి సంజయ్ నేరుగా ఎన్నికల ప్రచారంలోపాల్గొన్నారు.

బండి సంజయ్ అభ్యర్థి రఘునందనరావుతో కల్సి  మోతె, దౌల్తా బాద్ లోజరిగిన ప్రచార సభల్లో ప్రసంగించారు. దుబ్బాకలో బిజెపి రోజు రోజుకూ ఆదరణ పెరుగుతోందని కెసిఅర్ తాత వచ్చినా దుబ్బాలకలో బిజెపి గెలుపును ఆపలేరని అన్నారు. ఈ సందర్బంగా బండి సంజయ్ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై నిప్పులు చెరిగారు. కెసిఆర్ పాస్‌పోర్టుల  బ్రోకర్‌ అని విమర్శించారు. నీచమైన అవినీతి పరుడైన ముఖ్య మంత్రిని ఎన్నుకున్నందుకు దేశంలో ప్రశ్నిస్తుంటే రాష్ట్ర ప్రజలు తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. 

ప్రతి ఇంటికి రెండు పెన్షన్లు ఇవ్వాల్సిందేనని అన్నారు. రఘునందన్ గెలిచాక అసెంబ్లీలో మొదటి చర్చ పెన్షన్ల మీదే ఉంటుందని బండి సంజయ్ అన్నారు. బీసీలను తెలంగాణ సీఎం నట్టేట ముంచుతున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో భారీ వర్షాలకు ఇళ్లు నీటమునిగితే.. కేసీఆర్‌ మాత్రం ఫామ్‌హౌస్‌లో పడుకున్నారని మండిపడ్డారు. కేంద్రానికి వ్యవసాయ పంపుసెట్ల వద్ద మీటర్లు పెట్టే యోచనలేదని స్పష్టం చేశారు. కెసిఆర్ ఎక్కడైనా మీటర్లు పెడితే ఊరుకోమని అన్నారు. 

తెలంగాణ కోసం ఎంతో మంది చనిపోయారని సంజయ్ అన్నారు. అలా  ప్రాణాలు కోల్పోయిన వారిలో శ్రీకాంత చారి ఎబివిపి విద్యార్థని అన్నారు. రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులు అంతమంది  ఆత్మహత్యులు చేసుకున్నా సిఎం బయటి వచ్చి సంతాపం ప్రకటించలేదన్నారు.  ఆర్టీసి కార్మికులు చనిపోయినా బయటకు రాలేదన్నారు. ' తెరాస ఇచ్చే డబ్బులు తీసుకోండి.. బిజెపికి ఓటు వేయండి..దుబ్బాకలో  రఘునందన రావు భారి మెజార్టీతో గెలవడం ఖాయం..గెలిచిన తర్వాత వారం రోజులకు మల్లన్నసాగర్ రైతులతో ప్రగతి భవన్ ముట్టడిస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు