గొర్రె కుంట సామూహిక హత్యల కేసులో నిందితుడికి ఉరి శిక్ష


గీసుగొండ  మండలం గొర్రెకుంటలో 9 మందిని బావిలో పడేసి సామూహికంగా హత్య చేసిన నిందితుడికి కోర్టు ఉరి శిక్షను విధించింది. ఈ సామూహిక హత్యల కేసును కోర్టు 5 నెలల వారం రోజుల గడువులో విచారించి నిందితున్ని దోషిగా తేల్చి శిక్ష ఖరారు చేయడం రికార్డు అని చెప్పవచ్చు.

నిందితుడు  బీహార్ కు చెందిన సంజయ్ కుమార్ యాదవ్‌ గత మేనెల(2020) 21 వ తేదీన 9 మంది ప్రాణాలు తీసేందుకు ఆహారంలో మత్తు మందు ఇచ్చి వారిని పాడుబడిన బావిలో పడేసి చంపాడు. ఓ వివాహిత యువతిపై మోజు పడి ఆ తర్వాత ఆమెను చంపి ఆ హత్యను కప్పిపుచ్చుకునేందుకు  9 మందిని సామూహికంగా చంపాడు. ఎవరు హత్య చేసారో ఎందుకు చేసారో అంతుపట్టకుండా జరిగిన ఈ మిస్టరీ హత్యల కేసును పోలీసులు అప్పట్లో 48 గంటల వ్యవధిలోనే చేదించారు. సిసి కెమెరాలు, సెల్ ఫోన్ల కాల్ రికార్డు ఆధారంగా  హంతకుడు సంజయ్ కుమార్ యాదవ్ ను గుర్తించారు. 

 కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు 67 మంది వాగ్మూలం నమోదు చేసి 25 రోజుల్లో చార్జి షీటు దాఖలు చేసారు. హత్య గావించబడ్డ నిందితులు అంతా పశ్చిమ బెంగాళ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన వారు. ఇందులో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా మరో ముగ్గురు వేరే కుటుంబ సబ్యులు.  వీరంతా  స్థానికంగా ఓ గోనెసంచుల తయారి ఫ్యాక్టరీలో పనిచేసేవారు. మక్సూద్ ఆలం అనే వ్యక్తి కుటుంబంతో పరిచయం ఏర్పర్చుకుని సంజయ్ కుమార్ యాదవ్ ఆ కుటుంబానికి చెందిన  భర్తను వదిలి వేసిన రఫికా అనే యువతిని పెండ్లి చేసుకుంటానని మోసగించి కొంత కాలం సహజీవనం చేసాడు. రఫీకా పెండ్లి కోసం సంజయ్ తో తరుచూ గొడవ పడడంతో ఆమెను తన కుటుంబ సబ్యులకు పరిచయం చేస్తానని నమ్మించి ట్రైన్ లో ప్రయాణిస్తున్న సమయంలో తెల్లవారు జామున వైజాగ్ ప్రాంతంలో ట్రైన్ నుండి తోసేయడంతో ఆమె చనిపోయింది. ఆతర్వాత వరంగల్ తిరిగి వచ్చిన సంజయ్ మక్సూద్ ఫామిలీకి రఫీక బతికే ఉందని నమ్మించాడు. కాని రోజులు గడిచినా రఫీకా జాడ లేక పోవడంతో మక్సూద్ భార్య సంజయ్

ను నిలదీసింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదరించింది. దాంతో సంజయ్ వారికి మాయ మాటలు చెప్పి రఫీకా క్షేమంగా ఉందని చెప్పి నమ్మిస్తూనే మరో వైపు వారిని వదిలించు కునేందుకు ప్లాన్ చేసాడు. అహారంలో నిద్ర మాత్రలు  కలిపి వారికి తినిపించాడు. అనంతరం వారిని గోనెసంచుల్లో చుట్టి తీసుకు వెళ్ళి పాడు బడిన బావిలో పడేయడంతో చనిపోయారు. మృతుల్లో చిన్న పిల్లలు కూడ ఉన్నారు.

జిల్లా మొదటి అడిషినల్ జ్యూడిషినల్ మరియు వరంగల్ సెషన్స్  కోర్టులో ఈ కేసుకు సంబంధించిన ట్రయల్ నడిచింది. కరోనా కాలంలో కూడ కేసుకు ప్రాముఖ్యత నిచ్చి విచారించారు. నిందితుడు శిక్ష నుండి తప్పించు కోలేని విదంగా పోలీసులు అన్ని సాక్షాధారాలు నిరూపించారు.

ఈస్ట్ జోన్ డి.సి.పి వెంకటలక్ష్మీ, మామూనూర్ ఎ.సి.పి శ్యాంసుందర్, గీసుగొండ ఇన్ స్పెక్టర్ జూపెల్లి శివరామయ్య, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సత్యనారయణ, విశ్రాంత ఆసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మహమ్మద్ సర్దార్, ఎస్.ఐలు నాగరాజు, అబ్దుల్ రహీం, కోర్టు కానిస్టేబుల్ లింగయ్య, కోర్టులైజనింగ్ అధికారి వెంకటేశ్వర్లును పోలీసు కమీషనర్ ప్రమోద్ కుమార్ అభినందించారు. ఈ కేసు తీర్పు పోలీసు శాఖ పై ప్రజల నమ్మకాన్ని  పెంపొందింప చేసిందని కమీషనర్ పేర్కొన్నారు.


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు