మహిళల డిగ్రీ కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు - 18 వరకు దరఖాస్తుల స్వీకరణ

 


తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళల డిగ్రీ కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. తెలుగు, ఇంగ్లీష్, హిస్టరీ, ఎకనమిక్స్ లాంటి 25 సబ్జెక్టుల్లో ఫ్యాకల్టీ పోస్టులు ఉన్నాయి.


2. సంబంధిత కోర్సులో మాస్టర్స్ డిగ్రీ పాసైనవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు.

ఇవి ప్రస్తుత విద్యా సంవత్సరానికి భర్తీ చేస్తున్న తాత్కాలిక పోస్టులు మాత్రమే. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 2020 అక్టోబర్ 18 సాయంత్రం 5 గంటల్లోగా అప్లై చేయాలి.

3. మహిళల డిగ్రీ కళాశాలల్లో ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.tswreis.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
4. తెలుగు, ఇంగ్లీష్, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, బాటనీ, జువాలజీ, మైక్రో బయాలజీ, కామర్స్, సోషియాలజీ, సైకాలజీ, జర్నలిజం, జియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, జెనిటిక్స్, జాగ్రఫీ, ఫుడ్ సైన్స్, న్యూట్రిషన్ & డైటెటిక్స్ సబ్జెక్ట్స్‌లో ఖాళీలున్నాయి.

5. విద్యార్హత వివరాలు చూస్తే సంబంధిత సబ్జెక్ట్‌లో మాస్టర్స్ డిగ్రీ పాసైనవారు దరఖాస్తు చేయొచ్చు. పీహెచ్‌డీ, నెట్, స్లెట్, ఎంఫిల్ ఉన్నవారికి ప్రాధాన్యత. దరఖాస్తు ఫీజు రూ.500.

6. రాతపరీక్ష, డెమో, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. 2020 అక్టోబర్ 31 మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు రాతపరీక్ష ఉంటుంది. ఎంపికైన వారికి రూ.25,000 నుంచి రూ.30,000 వేతనం లభిస్తుంది.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు