టూషన్ మాస్టర్ తో 15 మంది పిల్లలకు కరోనా పాజిటివ్

 


పిల్లలను అటు ఉపాధ్యాయులు ఇటు తల్లి దండ్రులు చదువుల పేరిట ఇబ్బందులు పెడుతున్నారు. ఓ వైపు కరోనా మహమ్మారి ప్రాణాలు తోడేస్తున్నా  పిల్లలెక్కడ చదువుల్లో వెనకపడిపోతారో నంటూ ఆన్ లైన్ క్లాసులు, టూషన్లు అంటూ అగం చేస్తున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ లో గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం భట్లూరులో ఓ టూషన్ మాస్టారు కారణంగా 15 మంది పిల్లలు కరోనా భారిన పడ్డారు.  గత కొన్ని రోజులుగా పిల్లలకు టూషన్లు చెబుతున్న ఈ ఉపాధ్యాయుడు అనారోగ్యం పాలు కాగా టెస్టు చేయడంతో కరోనా పాజిటివ్  అని నిర్దారణ అయింది. దాంతో పిల్లలకు కూడ టెస్టులు నిర్వహించగా వారికి కూడ పాజిటివ్ గా నిర్దారణ అయింది. పిల్లల తల్లి దండ్రుల్లో కూడ కొందరికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ జరిగింది,.

కరోనా మహమ్మారి విషయంలో మొదట్లో భయ పడినంతగా ఎవరూ భయ పడటం లేదు. అంతే కాకుండా ఓ నిర్లక్ష్యం కూడ ఉంది. ఏమవుతుంది లే అనే నిర్లక్ష్యమే కొంపలు ముంచుతోంది. కరోనా మనకు కనిపించటం లేదని కరోనాకు మనం కనిపించటం లేదని భ్రమలు వద్దు.  ఏ మూలనో  కరోనా కాచుకుని ఉంటదనే విషయం మరిచి పోవద్దు. బయటికి టూషన్ల కోసం పంపకుండా ఎవరింట్లో వారి పిల్లలకు ఓపికగా పాఠాలు చెప్పుకుంటే అందరూ కుశలంగా ఉంటారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు