భారతీయుల ఆయుర్దాయం 10 ఏళ్లకు పెరిగిందా?

 భారతీయుల ఆయుర్దాయం 10 ఏళ్ళు పెరిగిందా ?
90వ దశకంలో భారత ప్రజల ఆయుర్దాయం 59.6 ఏళ్లు
2019 నాటికి 70.8 ఏళ్లకు చేరిందన్న లాన్సెట్ జర్నల్



భారతదేశ ప్రజల సగటు ఆయుర్దాయం 70.8 ఏళ్లకు పెరిగిందని ప్రపంచ ప్రఖ్యాత వైద్య పత్రిక లాన్సెట్ జర్నల్ తన అధ్యయన నివేదికలో పేర్కొంది. 1990 దశకంలో భారతీయుల సగటు ఆయుష్షు 59.6గా ఉండగా  2019 నాటికి అది గణనీయంగా పెరిగిందని వివరించింది. లాన్సెట్ జర్నల్ అధ్యమనం ప్రకారం స‌గ‌టు మనిషి జీవిత‌కాలంలో ప‌దేళ్ల ఆయుష్షు పెరిగింది. 

అయితే ఈ ఆయిర్దాయాలు ఇండియాలో రాష్ట్రాలను బట్టి భిన్నంగా ఉన్నాయని పేర్కొంది. కేరళలో సగటు జీవితకాలం 77.3 ఏళ్లకు పెరగ్గా, యూపీలో ఓ వ్యక్తి సగటు ఆయుష్షు 66.9 గా పేర్కొంది.


లాన్సెట్ జర్నల్ నివేదికపై ఇండియ‌న్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్  స్పందించిన తీరు ఆశ్యర్యకరంగా ఉంది. భారతీయుల సగటు ఆయుర్దాయం పెరిగినప్పటికీ వారు సంతోషంగా జీవిస్తున్నట్టు భావించలేమని, వారు అనేక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారని వెల్లడించించింది. భారత ప్రజలు అనుకున్నంత ఆరోగ్యంగా లేరని పబ్లిక్ హెల్త్ సష్టం చేసింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు