బజాజ్ సంస్థ నుండి క్యూట్ కార్


 


 బజాజ్ సంస్థ  సరికొత్త మోడల్ కార్ ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. "బజాజ్ క్యూట్ క్వాడ్రిసైకిల్" పేరుతో బీఎస్-6 మోడల్ వెర్షన్ లో సంస్థ అప్ డేటేడ్ వెర్షన్ ను తీసుకురానున్నది. ఇందులో డిజైన్ తో పాటు ఫీచర్లు బీఎస్-4 మోడల్ ఆటో మాదిరిగా ఉంటాయని సంస్థ వెల్లడించింది. పూణేలో ఉన్న బజాజ్ కంపెనీ ప్లాంట్ లో క్యూట్ సీఎన్ జీ వేరియంట్ మోడల్ ట్రైయల్ రన్ కూ డా వేశారు. బజాజ్ క్యూట్ సీఎస్ జీ వేరియంట్ లో డిజైన్ పరంగా ఫీచర్ పరంగా ఎలాంటి మార్పులు ఉండవని తెలుస్తున్నది. బీఎస్-4 ఇంజిన్ స్థానంలో బీఎస్-6 మోడల్ ఇంజిన్ ను ఏర్పాటు చేయనుంది.

క్వాడ్రి సైకిల్ లో 216.6 సీసీ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ను ఏర్పాటు చేశారు. సింగిల్ సిలిండర్ ఇంజిన్ తో గరిష్టంగా 5500 ఆర్ఫీఎమ్ వద్ద 13 బీహెచ్పీ సామర్థ్యాన్ని అందుకోగలదు. 4000 ఆర్ఫీఎమ్ వద్ద 18.9 ఎన్ఎమ్ టర్క్ విద్యుత్ ను ఉత్పత్తిని చేయగలదు. దీంతో పాటుగా ఈ క్వాడ్రి సైకిల్ లో కాన్ స్టాంట్ మెష్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్సులను ఏర్పాటు చేశారు. దీని వల్ల సులభంగా గేర్లను మార్చుకోవచ్చు. సీఎన్ జీ కిట్ తో క్యూట్ ను అందించనున్నారు. దీంతో క్వాడ్రి సైకిల్ గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. దీని పొడవు 2752 మి.మీ, వెడల్పు 1312 మి.మీ, ఎత్తు 1652 మి.మీ.లు ఉంటుందని సంస్థ తెలిపింది.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు