ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వ్యాప్తిని కప్పి పుచ్చింది - వైరాలజిస్టు లి మెంగ్‌ యాన్




 చైనా వైరాలజిస్ట్‌ లి మెంగ్‌ యాన్ మరో మారు సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ చైనా వ్యూహాన్ లాబ్ నుండి పుట్టిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ప్రపంచానికి పరిచయం అయిన  ఈ సైంటిస్టు ఈ సారి ప్రపంచ ఆరోగ్య సంస్థ - WHO ను టార్గెట్ చేసింది. కరోనా సమాచారాన్ని కప్పిపుచ్చడానికి డబ్ల్యూహెచ్‌ఓ ప్రయత్నాలు చేసిందని లి మెంగ్‌ యాన్ ఆరోపించింది. కరోనా వ్యాప్తి గురించి చైనా సర్కారుకు ముందే తెలుసని ఆమె పేర్కొంది. అంతేగాక, ఈ సమాచారాన్ని కప్పిపుచ్చడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఎన్నో ప్రయత్నాలు చేసిందని చెప్పింది. చైనాపై నిందపడకుండా చేయాలనుకుందని ఆమె ఆరోపించింది.


తాను చెబుతోన్న ఈ విషయాలను నిరూపించడానికి అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పింది. తాను ఈ విషయాలను చెబుతుండడంతో చైనా సర్కారు తనను సోషల్‌ మీడియా ద్వారా బెదిరించాలని చూస్తోందని ఆమె తెలిపింది. అలాగే, తన కుటుంబాన్ని కూడా భయపెడుతోందని చెప్పింది. కరోనా వైరస్‌ ఫుడ్‌ మార్కెట్‌ నుంచి రాలేదని, ల్యాబ్‌ నుంచే వచ్చిందని ఆమె మరోసారి స్పష్టం చేసింది. ఈ వైరస్‌ను చైనా ప్రభుత్వం ఎందుకు అభివృద్ధి చేసిందో, ఎందుకు బయటకు వచ్చేలా చేసిందో తాను ప్రజలకు తెలపాలనుకుంటున్నానని చెప్పింది. వూహాన్‌లో వైరస్‌ గురించి చేస్తోన్న పరిశోధనల్లో భాగంగా తనకు కొత్త విషయాలు తెలిశాయని తెలిపింది.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు